Narayana fires on BiggBoss : బిగ్‌బాస్ ని వ్యభిచారంతో పోల్చిన నారాయణ.. వాళ్ళకి కూడా గుండు కొట్టించండి అంటూ ఫైర్
ఇటీవల నల్గొండలో వ్యభిచారం చేస్తున్నారని ఇద్దరు మహిళలకి గుండు కొట్టించిన సంఘటన జరిగింది. ఈ ఘటనపై సిపిఐ నారాయణ మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనతో బిగ్‌బాస్ ని ముడిపెట్టారు.

CPI Narayana fires on BiggBoss again
Narayana fires on BiggBoss : బిగ్‌బాస్ షోకి ఎంత పాపులారిటీ ఉందో, ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో అంతే వ్యతిరేకత కూడా ఉంది. బిగ్‌బాస్ షోని సిపిఐ నారాయణ అయితే ఇప్పటికే చాలా సార్లు వ్యతిరేకించారు. ఆ షోని దారుణంగా విమర్శించారు. కుదిరినప్పుడల్లా ఆ షోని విమర్శిస్తూనే ఉంటారు. దీనిపై బిగ్‌బాస్ నిర్వాహకులు మాత్రం స్పందించలేదు. తాజాగా సిపిఐ నారాయణ మరోసారి బిగ్‌బాస్ పై తీవ్ర విమర్శలు చేశారు.
ఇటీవల నల్గొండలో వ్యభిచారం చేస్తున్నారని ఇద్దరు మహిళలకి గుండు కొట్టించిన సంఘటన జరిగింది. ఈ ఘటనపై సిపిఐ నారాయణ మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనతో బిగ్‌బాస్ ని ముడిపెట్టారు.
Krishnam Raju Idol : కృష్ణంరాజు విగ్రహానికి నివాళులు
నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. వాళ్ళు వ్యభిచారులు కాబట్టి గుండు కొట్టించాం అని అంటున్నారు. బిగ్‌బాస్ లో ఉన్న వాళ్ళకి మాత్రం చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తారు. ఆ మహిళలు వ్యభిచారులు అయితే బిగ్‌బాస్ లో ఉన్న వాళ్ళు కూడా అంతే కదా. మరి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు. బిగ్‌బాస్ సభ్యులకి కూడా గుండు కొట్టించండి అని తీవ్రంగా మండిపడ్డారు. సామాన్య మహిళలకి గుండు కొట్టించి అవమానిస్తారు కానీ బిగ్‌బాస్ షోలని మాత్రం ప్రోత్సహిస్తారు ఇదేం న్యాయం అని నారాయణ ప్రశ్నించారు.