Crazy Rambo : అశ్విన్ బాబు చేతుల మీదుగా ‘క్రేజీ రాంబో’ టైటిల్ లాంచ్..

మాస్ మసాలా ఎంటర్‌టైనర్ గా క్రేజీ రాంబో సినిమా తెరకెక్కనుంది.

Crazy Rambo : అశ్విన్ బాబు చేతుల మీదుగా ‘క్రేజీ రాంబో’ టైటిల్ లాంచ్..

Crazy Rambo Title Launch by Ashwin Babu

Updated On : July 29, 2024 / 9:20 PM IST

Crazy Rambo : షమ్ము హీరోగా హరీష్ మధురెడ్డి దర్శకత్వంలో ర్యాప్ రాక్ షకీల్ సప్తాశ్వ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా క్రేజీ రాంబో. మాస్ మసాలా ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ కార్యక్రమంలో హీరో అశ్విన్ బాబు గెస్ట్ గా పాల్గొన్నారు.

కామెడీ, యాక్షన్, డ్రామా, రొమాన్స్‌తో ఈ క్రేజీ రాంబో సినిమా ఉండబోతుంది. రాంబో టైటిల్ రోల్ లో హీరో షమ్ము ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. టైటిల్ లాంచ్ అనంతరం హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. క్రేజీ రాంబో టైటిల్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. సినిమా కూడా క్రేజీగా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ మూవీ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్, సినిమా మంచి హిట్ అవ్వాలి అని అన్నారు.

Also Read : Allu Sirish : అల్లు శిరీష్ సినిమా టికెట్ రేట్లు మరీ ఇంత తక్కువా? ‘బడ్డీ’ పాన్ ఏంటి?

హీరో షమ్ము మాట్లాడుతూ.. ఇది నా మూడో సినిమా. మూడో సినిమా మా అన్నయ్య ప్రొడక్షన్ లో చేయడం చాలా ఆనందంగా వుంది. క్రేజీ రాంబో కథ చాలా బాగుంటుంది అని అన్నారు.