అర్జున్ రెడ్డి హీరోయిన్‌పై క్రిమినల్ కేసు!

టాలీవుడ్‌లో ఒకే ఒక్క సినిమా అర్జున్ రెడ్డితో పీక్స్‌లో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ షాలినీ పాండే. ప్రీతి.. ప్రీతి అని అగ్రెసివ్ క్యారెక్టర్ పిలుస్తుంటే అంతే క్యూట్ అండ్ ఇన్నోసెంట్ గా చూసే కళ్లు ఎవరూ మర్చిపోలేరు. అందుకే సౌత్‌తో పాటు నార్త్‌లోనూ హవా నడిపిస్తోంది. దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ ఛాన్స్ కొట్టేసిన షాలినీ తమిళ్ ఇండస్ట్రీపై చిన్నచూపు చూస్తోందని విమర్శలు ఎదుర్కొంటోంది. 

దాంతో పాటు ఆమెపై క్రిమినల్ కేసు నమోదైనట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. విజయ్ ఆంటోనీ లీడ్ రోల్‌లో అరుణ్ విజయ్ లతో పాటు అగ్ని సిరాగుగల్ సినిమాకు సంతకం చేసింది షాలినీ. మూడార్ కూడమ్ నవీన్ దర్శకత్వంలో 27రోజులు షూటింగ్ కు కూడా వచ్చింది. ఆ తర్వాత ఒక్కసారిగా షూటింగ్ కు రావడం మానేసింది. ఆమెకు బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నాయని అందుకే ఆ ప్రాజెక్టుపై ఆసక్తి చూపడం లేదని తెలియడంతో  అమ్మ క్రియేషన్స్ టీ శివ నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడట. 

అయినా మాట వినకపోవడంతో ఆమెపై తమిళ, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇటీవల షాలినీకి రణవీర్ సింగ్‌తో నటించే అవకాశం దక్కింది. బాలీవుడ్ ఎంట్రీ దక్కడంతో ఇక కోలీవుడ్ ను పక్కకుపెట్టేసిందని  వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తమిళ ఇండస్ట్రీలో గొర్రిల్లా, 100 % కాదల్ సినిమాలు చేసింది. ‘అగ్ని సిరాగుగాల్’ సినిమాలో షాలినీ క్యారెక్టర్ లో అక్షర హాసన్ ను పెట్టి విదేశాల్లో షూటింగ్ చేస్తున్నారు.