Jagadish Cheekati : అంతర్జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులు.. అర్జున్ చక్రవర్తి కెమెరామెన్..
అర్జున్ చక్రవర్తి కెమెరామెన్ జగదీష్ చీకటి మీడియాతో మాట్లాడుతూ తన గురించి, సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు.(Jagadish Cheekati)

Jagadish Cheekati
Jagadish Cheekati : ఇటీవల కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘అర్జున్ చక్రవర్తి’ మంచి ఎమోషనల్ సినిమాగా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా 1980, 90 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా ప్లస్ అయ్యాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చాలా న్యాచురల్ గా ఉన్నాయి విజువల్స్. తాజాగా ఈ సినిమాకు కెమెరామెన్‌గా పనిచేసిన జగదీష్ చీకటి మీడియాతో మాట్లాడుతూ తన గురించి, సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు.(Jagadish Cheekati)
కెమెరామెన్ జగదీష్ చీకటి తన గురించి చెప్తూ.. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే ఫోటోగ్రఫీలో చాలా అవార్డులు వచ్చాయి. ఫోటోగ్రఫీలో మాస్టర్స్ చేశాను. దూరదర్శన్‌లోనూ పని చేశాను. వందకు పైగా షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్, కమర్షియల్ యాడ్స్, కొన్ని సినిమాలు చేశాను. దూరదర్శన్ లో ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి సినీ పరిశ్రమలోకి వచ్చాను. జత కలిసే సినిమాతో సినిమా కెమెరామెన్ గా మారాను. తర్వాత నాయకి, ఆర్జీవీ ప్రొడక్షన్స్ లో భైరవ గీత చేశాను. ఆ సినిమా చూసే అర్జున్ చక్రవర్తి డైరెక్టర్ నన్ను అప్రోచ్ అయ్యాడు అని తెలిపారు.
Also Read : Little Hearts Review : ‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ.. వామ్మో.. పడీ పడీ నవ్వాల్సిందే..
అర్జున్ చక్రవర్తి
అర్జున్ చక్రవర్తి సినిమా వర్క్ గురించి మాట్లాడుతూ.. అర్జున్ చక్రవర్తి హాలీవుడ్ స్థాయిలో ఉండటానికి నేచురల్ లైటింగ్‌లోనే షూటింగ్ చేశాం. సౌండ్ అయినా, సినిమాటోగ్రఫీ అయినా కూడా దర్శకుడి విజన్‌కు తగ్గట్టు చేసాము. నేను, డైరెక్టర్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమాని తీయాలని ముందే అనుకున్నాము. అందులో భాగంగానే రకరకాల వేరియేషన్స్‌తో సినిమాని తీశాం. పాత్ర తీరు, ప్రయాణానికి తగ్గట్టుగా కలర్ వేరియేషన్స్ చూపించాను. మూడు రకాల కెమెరాలతో షూట్ చేశాం. విజన్ డిఫరెన్స్ ఉండాలని ఎన్ మోర్ఫిక్, స్పెరికల్ లెన్స్‌లను వాడాం. క్యాస్టూమ్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ లో కూడా ప్రతీ విషయంలోనూ జాగ్రత్త తీసుకున్నాం అని అన్నారు.
అర్జున్ చక్రవర్తి షూటింగ్ సమయంలో ఫేస్ చేసిన ఇబ్బందుల గురించి చెప్తూ.. మంచు కురిసే ప్రాంతం కదా అని షూటింగ్ కి కాశ్మీర్‌కు వెళ్లాం. కానీ మేం వెళ్లినప్పుడు అక్కడ మంచు పడటం లేదు. దీంతో అక్కడే మంచు కురిసే వరకు ఎదురుచూశాం. చివరకు మైనస్ 8 డిగ్రీల వరకు వచ్చాక షూటింగ్ చేసాము. మంచు కురుస్తుంటే స్వర్గమంటే ఇదేనేమో అన్నట్టుగా అనిపించింది. విజువల్స్ అద్భుతంగా వచ్చాయి కానీ ఆ మంచు ప్రాంతంలో షూటింగ్ చేయడం కష్టంగా అనిపించింది. క్లైమాక్స్ ఎపిసోడ్‌కి చాలా కష్టపడాల్సి వచ్చింది. టెక్నికల్‌గా చాలా ఇబ్బంది ఏర్పడింది. 800 మందిని, ప్లేయర్స్‌ని టైమ్ స్లైస్ అనే ఓ పరికరంతో షూట్ చేయాలని అనుకున్నాం. కానీ అది అందుబాటులో లేకపోయే సరికి అందరినీ ఫ్రీజ్‌లో పెట్టి షూట్ చేశాం అని తెలిపారు.
Also Read : Pawan Kalyan : అమెరికాలో పవన్ కళ్యాణ్ OG దూకుడు.. పుష్ప, దేవర, సలార్ రికార్డ్ లను బద్దలుకొట్టి..
Jagadish Cheekati
ఈ సినిమాకు తనకు వచ్చిన అవార్డుల గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో చాలా అవార్డులు రాగా అందులో నాకు నాలుగు అవార్డులు వచ్చాయి. కోలీవుడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియా, కేరవ్యాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, మోకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ది బుద్దా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డులు వచ్చాయి అని అన్నారు.
అలాగే.. సినిమా ఆలస్యం అయినా, మంచి అవుట్ పుట్ కోసం ఏం కావాలన్నా నిర్మాత శ్రీని గుబ్బల సపోర్ట్ చేసారు. సినిమా కోసం ఏదైనా చెయ్యండి అన్నారు. మధ్యలో ఆర్థిక సమస్యలు వచ్చినా ఆయన నిలబడ్డారు. సినిమా రిలీజయ్యాక ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్స్ చేసి సినిమా బాగుందని, నా వర్క్ బాగుందని అన్నారు. కబడ్డీ ఆటలో మనం ఉన్నామా అనే ఫీలింగ్ ఇచ్చేలా కెమెరాల్ని కూడా ఆటలో భాగంగా ఆడించేలా ట్రైనింగ్ తీసుకుని షూటింగ్ చేశాం అని తెలిపారు.