Daakko Daakko Meka : ‘దాక్కో దాక్కో మేక’ వీడియో సాంగ్ వచ్చేసింది..
‘పుష్ప’ లోని ఫస్ట్ వీడియో సాంగ్ ‘దాక్కో దాక్కో దాక్కో మేక’ రిలీజ్..
Daakko Daakko Meka: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’ బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది. తెలుగుతో పాటు విడుదల చేసిన మిగతా భాషల్లోనూ ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 2021లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన ఇండియన్ సినిమాగా ‘పుష్ప’ పార్ట్-1 రికార్డ్ క్రియేట్ చేసింది.
Nivetha Thomas : ‘జై బాలయ్య’ పాటకు నివేదా థామస్ డ్యాన్స్! వీడియో వైరల్
గురువారం ఈ సినిమాలోనుండి ‘దాక్కో దాక్కో దాక్కో మేక’ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. మూవీలో ఇది ఫస్ట్ సాంగ్.. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ పాట విడుదల చేశారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చెయ్యగా.. చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ రాశారు.
Kinnerasani Trailer : ‘ఇది కథ కాదు.. ప్రతి అక్షరం నిజం’..
విఎమ్ మహాలింగం సాకి, శివమ్ సాంగ్ పాడారు. ‘వేటాడేది ఒకటి.. పరిగెత్తేది ఇంకొకటి.. దొరికిందా.. ఇది సస్తాది.. దొరక్కపోతే.. అది సస్తాది.. ఒక జీవికి ఆకలేసిందా.. ఇంకో జీవికి ఆయువు మూడిందే’.. ‘కాలే కడుపు చూడదురో.. నీతి, న్యాయం’ వంటి పదాలు ఆకట్టుకుంటాయి. ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.