రానా తమ్ముడు యాక్సిడెంట్ చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన దగ్గుబాటి ఫ్యామిలీ..

  • Published By: sekhar ,Published On : August 13, 2020 / 01:37 PM IST
రానా తమ్ముడు యాక్సిడెంట్ చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన దగ్గుబాటి ఫ్యామిలీ..

Updated On : August 13, 2020 / 2:02 PM IST

కారు ప్ర‌మాదానికీ, ద‌గ్గుబాటి అభిరామ్‌కూ ఎలాంటి సంబంధం లేదు.. అసలు అది ద‌గ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన కారే కాదని తాజాగా దగ్గుబాటి కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.

బుధవారం రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని మ‌ణికొండ‌లో ద‌గ్గుబాటి అభిరామ్ కారు ప్ర‌మాదానికి గురైంద‌నీ, ఎదురుగా వ‌స్తున్న కారును ఆయ‌న కారు ఢీకొట్టింద‌నీ మీడియాలో, ఆన్‌లైన్‌లో జ‌రుగుతున్న ప్రచారాన్ని అభిరామ్ కుటుంబ‌స‌భ్యులు ఖండించారు. అవి కేవ‌లం వ‌దంతులు మాత్ర‌మేననీ, మీడియాలో చూపిస్తున్న కారు అస‌లు ద‌గ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించినది కాద‌నీ వారు స్ప‌ష్టం చేశారు.

ఇటీవలే రానా వివాహం జరిగిన తరుణంలో ప్రస్తుతం తమ ఇంట్లో సందడి వాతావరణం నెలకొందని ఈ విష‌యంలో ద‌య‌చేసి వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, వాటిని ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని వారు కోరారు.