Dandora : తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘దండోరా’
విలక్షణ నటుడు శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్ణ, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ దండోరా.

Dandora movie pooja ceremony in Ramanaidu Studios
విలక్షణ నటుడు శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్ణ, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ దండోరా. మురళీకాంత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘కలర్ ఫోటో’, ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియోలో బుధవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. చిత్ర బృందాన్ని అభినందించారు.
Akhanda 2 : బాలయ్య-బోయపాటి ‘అఖండ 2’ నుంచి సాలీడ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్..
ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి క్లాప్ కొట్టారు. బేబీ నిర్మాత ఎస్ కే ఎన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గౌరవ దర్శకత్వం వహించారు.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూ.. వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.