పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘దర్బార్’

సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబోలో ‘దర్బార్’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిత్ర ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ రివీల్ చేసింది చిత్ర యూనిటి. ఈ రోజు పూజా కార్యక్రమాలను పూర్తి చేసి మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళారు. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన పూజా కార్యక్రమంలో రజినీకాంత్, మురుగదాస్, నిర్మాత అల్లిరాజా శుభస్కరన్, యూనిట్‌లోని ఇతర సభ్యులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం రజినీకాంత్, శుభస్కరన్ కలిసి స్క్రిప్టును మురుగదాస్‌కు అందజేశారు.
ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, ‘పేట’కు సంగీతం సమకూర్చిన అనిరుధ్ రవిచంద్రన్ మరోసారి రజనీకాంత్ చిత్రానికి సంగీతం అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఇందులో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.