నలుపు రంగున్న సింగ మొచ్చేసిండన్నా.. ‘‘దర్బార్’’ – ఫస్ట్ లిరికల్ సాంగ్

‘దర్బార్’ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్, అనంత శ్రీరామ్ లిరిక్స్, అనిరుధ్ ట్యూన్ హైలెట్‌గా నిలిచాయి..

  • Published By: sekhar ,Published On : November 27, 2019 / 11:59 AM IST
నలుపు రంగున్న సింగ మొచ్చేసిండన్నా.. ‘‘దర్బార్’’ – ఫస్ట్ లిరికల్ సాంగ్

Updated On : November 27, 2019 / 11:59 AM IST

‘దర్బార్’ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ – ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్, అనంత శ్రీరామ్ లిరిక్స్, అనిరుధ్ ట్యూన్ హైలెట్‌గా నిలిచాయి..

సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా.. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్..‘దర్బార్’.. సునీల్ శెట్టి, నివేదా ధామస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు  శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ‘దర్బార్’ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రజనీ ‘ఆదిత్య అరుణాచలం అనే పవర్‌ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు..

బుధవారం సాయంత్రం ‘దర్బార్’ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘దుమ్ము ధూళి’ అంటూ సాగే ఈ పాటకు అనిరుధ్ ట్యూన్ కంపోజ్ చేయగా.. గానగంధ్వరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా పాడారు. ఆయన గాత్రంలో కుర్రతనం, చిలిపితనం పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. తమిళ్ పాట కూడా బాలూనే పాడడం విశేషం.

హీరోయిజాన్ని హైలెట్ చేస్తూ, హీరో పాత్రని పరిచయం చేస్తూ, వినేవాళ్లని మోటివేట్ చేస్తూ సాగే ఈ పాటకు అనంత శ్రీరామ్ చక్కటి లిరిక్స్ రాశారు. శ్రీ కృష్ణ, ఆదిత్య అయ్యంగార్, సాకేత్ కోమండూరి బ్యాగ్రౌండ్ పాడారు.. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లోనూ పాట విడుదల చేశారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ‘దర్బార్’ 2020 జనవరి 9న భారీగా విడుదల కానుంది. సంగీతం : అనిరుధ్, కెమెరా : సంతోష్ శివన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్.