Dasara Movie: యూఎస్‌లో ‘దసరా’కు సాలిడ్ రెస్పాన్స్.. ప్రీమియర్లతోనే దుమ్ములేపింది!

నాచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దసరా’ భారీ అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. యూఎస్‌లో దసరా సినిమా కోసం భారీగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జరగడంతో, ప్రీమియర్ల రూపంలో ఏకంగా $500K వసూళ్లు వస్తున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.

Dasara Movie: యూఎస్‌లో ‘దసరా’కు సాలిడ్ రెస్పాన్స్.. ప్రీమియర్లతోనే దుమ్ములేపింది!

Dasara Movie Starts With Solid Bang In USA

Updated On : March 30, 2023 / 9:17 AM IST

Dasara Movie: నాచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దసరా’ భారీ అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో నటీనటులు అందరూ డీగ్లామర్ పాత్రల్లో నటించగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను పెంచేశాయి.

Dasara Movie: తొలిరోజే భారీ వసూళ్లపై కన్నేసిన దసరా.. కాన్ఫిడెంట్‌గా ఉన్న నాని!

ఇక ఈ సినిమాను నాని తన కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై కేవలం ఇండియాలోనే కాకుండా, నానిక మంచి పట్టున్న ఓవర్సీస్ మార్కెట్‌లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ముఖ్యంగా యూఎస్‌లో దసరా సినిమా కోసం భారీగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జరగడంతో, ప్రీమియర్ల రూపంలోనే అక్కడ దసరా చిత్రం దుమ్ములేపినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు ఇప్పటివరకు ప్రీమియర్ల రూపంలో ఏకంగా $500K వసూళ్లు వస్తున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.

Image

ప్రీమియర్లు మొత్తం పూర్తయ్యేసరికి ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దసరా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, ఓవర్సీస్‌లో కలెక్షన్ల మోత మోగడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. నానికి బలమైన ఫాలోయింగ్ ఉన్న అమెరికాలో దసరా సినిమా మొత్తంగా ప్రీమియర్ల రూపంలో ఎంతమేర వసూళ్లు రాబడుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.