Nithiin : ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేవిడ్ వార్నర్.. త్వరలో ఏపీ డిప్యూటీ సీఎంను కలుస్తాను..
డేవిడ్ వార్నర్ నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో నటిస్తున్నట్టు ఆల్రెడీ మూవీ యూనిట్ ప్రకటించింది.

David Warner Coming to Nithiin Robinhood Pre Release Event
Nithiin : ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గతంలో ఐపీఎల్ లో SRH కి ఆడటం, తెలుగు సినిమాల పాటలు, డైలాగ్స్ కు రీల్స్ చేయడంతో తెలుగు ప్రేక్షకుల్లో వార్నర్ కి మంచి ఫాలోయింగ్ వచ్చింది. తెలుగు ఫెస్టివల్స్ కూడా జరుపుకోవడంతో మరింత దగ్గరయ్యాడు. ఇదే ఊపులో తెలుగు సినిమాల్లో నటించమని కూడా ఫ్యాన్స్ అడిగారు.
డేవిడ్ వార్నర్ నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో నటిస్తున్నట్టు ఆల్రెడీ మూవీ యూనిట్ ప్రకటించింది. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. నేడు విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించగా నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. డేవిడ్ వార్నర్ ను సినిమాలో నటింపజేయాలన్న ఆలోచన హీరో నితిన్ దే. డేవిడ్ వార్నర్ ను మేము మా సినిమాలో నటించమని కోరగానే అంగీకరించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ పాల్గొంటారు అని తెలిపారు.
Also Read : Pushpa 3 : పుష్ప 3 అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. మూడేళ్ళలోనే.. సుకుమార్, అల్లు అర్జున్ టైం ఇస్తారా?
రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేవిడ్ వార్నర్ వస్తాడు అని ప్రకటించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈవెంట్, ఎప్పుడు, ఎక్కడ ఉంటుందో అని ఎదురుచూస్తున్నారు. రాబిన్ హుడ్ సినిమా మార్చ్ 28న రిలీజ్ కాబోతుంది. త్వరలోనే రాబిన్ హుడ్ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోనే ఉంటుందని సమాచారం.
ప్రెస్ మెట్ లో నితిన్ మాట్లాడుతూ.. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను అని తెలిపారు. పవన్ కి ఉన్న వీరాభిమానుల్లో నితిన్ ఒకరు అని అందరికి తెలిసిందే. గతంలో నితిన్ రెండు సినిమాలకు పవన్ గెస్ట్ గా వచ్చారు. పవన్ నిర్మాణంలో నితిన్ సినిమా కూడా చేసారు. త్వరలో నితిన్ పవన్ ని కలుస్తాను అని చెప్పడంతో ఫ్యాన్స్ వీరి కలయిక కోసం ఎదురుచూస్తున్నారు.