David Warner – nithin : నితిన్ మూవీలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్..!
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్‌ను తెలుగు రాష్ట్రాల వారికి పరిచయం చేయాల్సిన పని లేదు

David Warner in Nithin movie Robinhood
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్‌ను తెలుగు రాష్ట్రాల వారికి పరిచయం చేయాల్సిన పని లేదు. తన విధ్వంసకర ఆటతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వార్నర్.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున చాలా కాలం పాటు ఆడి తెలుగు వారికి ఎంతో దగ్గర అయ్యాడు. అంతేనా.. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో తెలుగు సినిమాల హీరోల డైలాగ్స్, సాంగ్స్ లను రీల్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి ఆకట్టుకున్నాడు. ఇక తెలుగు సినిమాలు వార్నర్‌కు ఎంతో ఇష్టం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇక తనకు ఎంతో ఇష్టమైన తెలుగు సినిమాలో వార్నర్ యాక్టింగ్ చేశాడట. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ చిత్రంలో అతిథి పాత్రలో నటించారు. ఇటీవలే ఆస్ట్రేలియాలో ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు. లొకేషన్లలో వార్నర్ స్టిల్స్ నెటింట్ట వైరల్‌గా మారాయి.
Supritha : కిస్సిక్ పాటకి అదిరిపోయే స్టెప్పులేసి సుప్రీత.. వీడియో చూసారా..
వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీలీల కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Big Boss Priyanka : తిరుపతిలో కూడా అదే పాడుపని చేసిన బిగ్ బాస్ ప్రియాంక.. తీరా చూస్తే..