తెలుగులో ఫట్ – హిందీలో హిట్!

యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయి వ్యూస్ రాబడుతున్న విజయ్ దేవరకొండ ‘‘డియర్ కామ్రేడ్’’ హిందీ వెర్షన్..

  • Published By: sekhar ,Published On : January 21, 2020 / 07:34 AM IST
తెలుగులో ఫట్ – హిందీలో హిట్!

Updated On : January 21, 2020 / 7:34 AM IST

యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయి వ్యూస్ రాబడుతున్న విజయ్ దేవరకొండ ‘‘డియర్ కామ్రేడ్’’ హిందీ వెర్షన్..

సెన్షేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా, భరత్ కమ్మ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్‌పై.. నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, వై.రవిశంకర్, యష్ రంగినేని నిర్మించిన సినిమా.. ‘‘డియర్ కామ్రేడ్’’.. గతేడాది జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది.

తాజాగా ‘‘డియర్ కామ్రేడ్’’ హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా రికార్డ్ స్థాయి వ్యూస్ రాబట్టడం విశేషం. గతకొద్ది కాలంగా మన తెలుగు సినిమాల హిందీ డబ్డ్ వెర్షన్స్‌కి నార్త్ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతూ తెలుగు మరియు హిందీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన సినిమాలు చాలానే ఉన్నాయి.

Read Also : ‘సామజవరగమన’ నాకు తోడుగా నిలిచింది – కేటీఆర్ ప్రశంస : స్పందించిన థమన్

అయితే గోల్డ్ మైన్స్ టెలిఫిలింస్ సంస్థ జనవరి 19న ‘‘డియర్ కామ్రేడ్’’ హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా కేవలం 24 గంటల్లో ఏకంగా 12 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుందని హిందీ నిర్మాత తెలిపారు. ప్రస్తుతానికి 17 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. తెలుగులో ఫట్ అయిన ‘‘డియర్ కామ్రేడ్’’ హిందీలో హిట్ అవడం.. యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయడం విశేషమనే చెప్పాలి.. 
Image