ఈ సారి కాకినాడ యాసలో : డియర్ కామ్రేడ్ ఫస్ట్ లుక్

  • Published By: venkaiahnaidu ,Published On : March 8, 2019 / 05:12 AM IST
ఈ సారి కాకినాడ యాసలో : డియర్ కామ్రేడ్ ఫస్ట్ లుక్

Updated On : March 8, 2019 / 5:12 AM IST

అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవర కొండ,రష్మిక జంటగా నటిస్తున్నమూవీ డియర్ కామ్రేడ్ ఫస్ట్ లుక్ వచ్చింది. విజయ్ – రష్మిక హగ్ చేసుకున్నట్లు ఉన్న ఈ లుక్ యూత్ ను ప్లాట్ చేసింది. వీరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో మూవీ ఇది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మార్చి-17, 2019న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు విజయ్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.
Also Read : నా కొడుకు లోకేష్ మీద ఒట్టు : లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2

భరత్ కమ్మ ఈ సినిమాను డైరక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో స్టూడెంట్ లీడర్ గా కాకినాడ యాసలో మాట్లాడి అలరించనున్నాడు విజయ్. క్రికెటర్ గా రష్మిక కనిపించనుంది. రష్మిక, విజయ్‌ కాంబినేషన్‌లో వస్తున్న రెండో మూవీ కావటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. గీతగోవిందం ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. ఈమూవీ కూడా అదే రేంజ్ లో ఉంటుందనే టాక్ సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 

Also Read : ఆన్ లైన్‌లో ప్రపోజ్ చేస్తే చంపేస్తా : హీరోయిన్ సోనాక్షి సిన్హా