Ranveer- Deepika: రూమర్స్ కి చెక్ పెట్టిన దీపికా పదుకొణె.. భారీ విజయంలో భర్తకు సపోర్ట్ గా!
తమపై వస్తున్న రూమర్స్ కి బాలీవుడ్ జంట రణవీర్ - దీపికా(Ranveer- Deepika) క్లారిటీ ఇచ్చేశారు.
Deepika Padukone dinner date with her husband Ranveer singh
- ముంబై వీధుల్లో రణవీర్- దీపికా
- ధురంధర్ 2 సక్సెస్ లో భర్తకు సపోర్ట్ గా
- నవ్వుతూనే రూమర్స్ కి చెక్ పెట్టిన జంట
Ranveer- Deepika: బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్(Ranveer- Deepika) ఆదివారం ముంబై వీధుల్లో సందడి చేస్తూ కెమెరాకు చిక్కారు. రణవీర్ నటించిన తాజా చిత్రం ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్న వేళ, ఈ జంట ఇలా బహిరంగంగా కనిపించడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గత కొన్ని రోజులుగా రణవీర్ సాధించిన ఈ భారీ విజయంపై దీపికా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకపోవడం, సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరుకాకపోవడంపై నెట్టింట రకరకాల పుకార్లు షికారు చేశాయి.
Tamanna Bhatia: మిల్కీ బ్యూటీ గ్లామర్ కి మెల్ట్ అవుతున్న నెటిజన్స్.. అబ్బబ్బా, ఏం అందం.. ఫొటోలు
అయితే, వాటన్నింటికీ చెక్ పెడుతూ ఈ జంట ముంబైలోని ఒక ప్రముఖ రెస్టారెంట్‌కు లంచ్ డేట్ కోసం వచ్చారు. ఆ రెస్టారెంట్ బయట రణవీర్‌ను చూడగానే అభిమానులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. బబ్బర్ షేర్ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. భర్తను ఆడియన్స్ ఎలా పిలవడంతో దీపికా ముఖంలో గర్వం, సంతోషం స్పష్టంగా కనిపించాయి. సోషల్ మీడియాలో మౌనంగా ఉన్నప్పటికీ, తన చిరునవ్వుతోనే రణవీర్ విజయాన్ని ఎంతగా ఆస్వాదీస్తుందో క్లియర్ గా అర్థం అయ్యింది.
దీంతో, బయట వినిపిస్తున్న రూమర్స్ కి చెక్ పడింది. రణవీర్ సింగ్ కెరీర్లోనే ధురంధర్ 2 బిగ్గెస్ట్ హిట్ కావడంతో, ఈ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకే ఈ జంట ఇలా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. విమర్శకులకు తనదైన శైలిలో సమాధానమిస్తూ, భర్త విజయానికి సపోర్ట్ గా నిలిచిన దీపికా ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
