Deepika Padukone: టాప్ 10 ప్రపంచ సుందరి జాబితాలో దీపికా పదుకోణె..
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణె.. తన నటనతో, డాన్స్ లతో అలాగే అందంతో ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ఇప్పటికే ఈ సుందరి ఎన్నో అవార్డులను అందుకోగా, ఇప్పుడు మరో ఘనత సాధించింది. రన్ వీర్ సింగ్ ని పెళ్లాడిన తరువాత కూడా వరస సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్ టాప్ 10 ప్రపంచ సుందరి జాబితాలో చోటు దక్కించుకుంది.

Deepika Padukone is the only Indian listed in the 10 most beautiful women in the world
Deepika Padukone: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణె.. తన నటనతో, డాన్స్ లతో అలాగే అందంతో ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ఇప్పటికే ఈ సుందరి ఎన్నో అవార్డులను అందుకోగా, ఇప్పుడు మరో ఘనత సాధించింది. రన్ వీర్ సింగ్ ని పెళ్లాడిన తరువాత కూడా వరస సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్ టాప్ 10 ప్రపంచ సుందరి జాబితాలో చోటు దక్కించుకుంది.
Deepika Padukone : అడిడాస్ యాడ్ షూట్ లో దీపికా వర్కింగ్ స్టిల్స్
ఒక ప్రముఖ హాలీవుడ్ సంస్థ నిర్వహించే ఈ పోటీలో కళ్ళు, ముక్కు, పెదవులు, మరియు ముఖ ఆకృతి మొదలైన వాటితో సహా వివిధ లక్షణాలను అంచనా వేసి.. ప్రపంచంలోనే అత్యంత సుందరిమణులను ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో ఇండియా తరుపు నుంచి ఎంపిక అయిన ఒకేఒక్క యాక్ట్రెస్ దీపికా.. 91.22 శాతం సాధించి టాప్ 10 లిస్టులో 9వ స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ నటిస్తున్న పఠాన్ చిత్రంలో నటిస్తుండగా, తెలుగులో ప్రభాస్ సరసన ప్రాజెక్ట్-K సినిమాలో మెరవనుంది. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బిగ్-బి అమితాబ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. అశ్వని దత్త్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మీకీ జె మేయర్ స్వరాలు అందిస్తున్నాడు.