Deepika Padukune : అనన్య పాండే ఎవరో తనకు తెలియదన్న దీపికా పదుకునే.. ఫ్యాన్స్ ట్రోలింగ్

ఇటీవల అనన్య, దీపికా పదుకునే కలిసి 'గెహ్రాయాన్' సినిమాలో నటించారు. ఇంటర్య్వూలో అనన్య గురించి దీపికా మాట్లాడుతూ.. ‘గెహ్రాయాన్ మూవీ చేసే ముందు వరకు నాకు అనన్య పాండే అంటే ఎవరో తెలియదు.

Deepika Padukune : అనన్య పాండే ఎవరో తనకు తెలియదన్న దీపికా పదుకునే.. ఫ్యాన్స్ ట్రోలింగ్

Deepika Padukune

Updated On : February 4, 2022 / 11:06 AM IST

Ananya Panday :   ‘స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి రెండు సినిమాలతోనే భారీ విజయాలు సాధించి అవార్డులు కూడా గెలుచుకుంది అనన్య పాండే. ఇప్పుడు తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’ సినిమాలో నటిస్తుంది. అనన్యకు బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారుకి హీట్ ఎక్కిస్తుంది.

 

ఇటీవల అనన్య, దీపికా పదుకునే కలిసి ‘గెహ్రాయాన్’ సినిమాలో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 11న అమెజాన్ లో రిలీజ్ అవ్వనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా దీపికా పదుకునే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనన్యపై సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో అనన్య అభిమానుల నుంచి దీపిక వ్యతిరేకతని ఎదుర్కొంటుంది.

ఇంటర్య్వూలో అనన్య గురించి దీపికా మాట్లాడుతూ.. ‘గెహ్రాయాన్ మూవీ చేసే ముందు వరకు నాకు అనన్య పాండే అంటే ఎవరో తెలియదు. తనని ఎప్పుడు కలవలేదు కూడా. ఇదేదో జోక్‌ చేయడానికి చెప్పడం లేదు. నిజంగానే మూవీ మొదలయ్యే ముందు వరకు అనన్య ఎవరో నాకు అసలు తెలియదు. అందరి లాగే నేను కూడా తన పేరును సోషల్‌ మీడియాలో విన్నాను’ అని అనన్య గురించి మాట్లాడింది.

Hero : మహేష్ మేనల్లుడు ‘హీరో’ ఓటీటీ రిలీజ్.. డేట్ ఫిక్స్

ఆ తర్వాత మళ్ళీ అనన్య గురించి మాట్లాడుతూ..‘నా వయసు 36, అనన్య వయసు 23. నా కన్నా చాలా చిన్నది. తనతో కలిసి నటించడం మంచి అనభూతిని ఇచ్చింది. అనన్య చాలా తెలివైన అమ్మాయి. సెట్‌లో ఇతర నటులు ఎలా నటిస్తున్నారనేది బాగా పరిశీలిస్తుంది, నేర్చుకుంటుంది. తను భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్ట్స్‌ చేయాలని కోరుకుంటున్నాను’ అని తెలిపింది.

OTT Platforms: ఓటీటీల పోటీ.. స్ట్రీమింగ్ రైట్స్ కోసం కాంపిటీషన్

అయితే అనన్య ఎవరో తెలియదంటూ దీపికా చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అనన్య అభిమానులు సోషల్ మీడియాలో దీపికను ట్రోల్ చేస్తున్నారు. నువ్ స్టార్ హీరోయిన్ అయితే నీ కోస్టార్ గురించి కూడా నీకు తెలీదా, బాలీవుడ్ లో ఫిలింఫేర్ అవార్డ్స్ తీసుకున్నా కూడా తానెవరో నీకు తెలీదా, ఒకప్పటి స్టార్ హీరో కూతురు అయినా కూడా నీకు తెలీదా.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ దీపికాని ప్రశ్నిస్తున్నారు.