Guppedantha Manasu : కాలేజ్ ఎండీగా వసుధర.. దేవయాని, శైలేంద్రకు ఊహించని షాక్
రిషి కుటుంబ సభ్యులు.. అటు మంత్రిగారు అంతా కాలేజీకి చేరుకుంటారు. కాలేజీ ఎండీగా రిషి నిర్ణయించిన పేరును ఓ కవర్ లోంచి బయటకు తీస్తాడు మంత్రి. ఆశపడ్డ శైలేంద్రకు ఎండీ సీటు దక్కిందా.. లేక.. ?

Guppedantha Manasu
Guppedantha Manasu : దేవయాని, శైలేంద్ర రిషిని పిలిచి ఎండీ సీటుపై నిర్ణయం తీసుకోమంటారు. ఇంట్లో వారినే ఎండీ సీట్లో కూర్చోపెడతానంటాడు రిషి. అసలు రిషి ఎవరి పేరు ఎండీగా సూచిస్తాడు?
కాలేజీ ఎండీ సీట్లో రిషి ఎవరిని కూర్చోపెడతాడని తెగ ఆరాటపడిపోతుంటారు దేవయాని, శైలేంద్ర. రిషిని పిలిచిన దేవయాని ‘ఆ సీట్లో నువ్వే కూర్చోవాలి’ అని చెబుతుంది. అందుకు తాను సిద్ధంగా లేనంటాడు రిషి. ఇంట్లో వాళ్లనే ఎండీ సీట్లో కూర్చోపెడతానని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ‘సరైన టైంలో రిషి సరైన నిర్ణయం తీసుకుంటాడని’ వసుధర వారికి చెబుతుంది. ‘శైలేంద్ర కోరిక ప్రకారం తనకి ఎండీ సీటు దక్కితే అందరూ ప్రశాంతంగా ఉంటారు’ అంటుంది దేవయాని వసుధరతో. ‘కాలేజీ ఎప్పటికీ రిషిదే.. ఎండీ సీటు కూడా రిషీది మాత్రమే’ అంటుంది వసుధర. ‘అయితే పిన్ని జగతి చనిపోయినట్లు రిషి చనిపోతాడేమో’ అని వసుధరను బెదిరిస్తాడు శైలేంద్ర. ‘మీకు రోజులు దగ్గరపడ్డాయి.. ఒక చిన్న ఆధారం కోసం వెతుకుతున్నాను.. అది బయటపడితే మీ పరిస్థితి ఆలోచించుకోమని’ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధర.
ఇటు రిషి కుటుంబ సభ్యులు.. అటు మంత్రి అందరూ కాలేజీకి చేరుకుంటారు. కాలేజీలో స్టూడెంట్స్ అంతా రిషి కాలేజ్ ఎండీగా ఉండాలని ప్ల కార్డులు పట్టుకుని నినాదాలు చేస్తుంటారు. అందరూ కాలేజీ లోపలికి వెళ్తారు. మంత్రి ఒక కవర్ తీస్తాడు. ‘రిషి కాలేజీ ఎండీ సీట్లో ఎవరు కూర్చోవాలో నిర్ణయం తీసేసుకున్నాడు.. వారి పేరు ఈ కవర్ లో రాసాడు. అదెవరో నాకు తెలీదు. ఎవరి పేరు ఉన్నా మీకు సమ్మతమేనా?’ అని అందర్నీ అడుగుతాడు. అందరూ ఓకే అంటారు. ఎండీగా తన పేరే ఉంటుందని డిసైడ్ అయిన శైలేంద్ర లోలోపల సంబరపడిపోతుంటాడు. ఆత్రం ఆగక లేచి నిలబడతాడు. మంత్రి కవర్ ఓపెన్ చేసి వసుధర పేరు అనౌన్స్ చేయగానే శైలేంద్ర, దేవయాని ఖంగు తింటారు. వారి మొహాలు మాడిపోతాయి. వసుధర కూడా ఆశ్చర్యపోతుంది. అందరూ చప్పట్లు కొడతారు. ఆ తరువాత ఏం జరిగింది? నెక్ట్స్ ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.
ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘గుప్పెడంత మనసు’ సీరియల్ కాపుగంటి రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.