Dhanush: రాజంపేటలో స్టార్ హీరో ధనుష్.. శేషాచలం అడవుల్లో షూటింగ్.. అభిమానుల తాకిడితో భారీ బందోబస్తు
షూటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన తమిళ స్టార్ ధనుష్(Dhanush).
Dhanush movies shot in the Seshachalam forest
- శేషాచలం అడవుల్లో ధనుష్ షూటింగ్.
- ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా.
- రాజంపేట లాడ్జి వద్ద ఫ్యాన్స్ హంగామా.
Dhanush: కడప జిల్లాలోని రాజంపేట మండల పరిధిలో గల రోళ్లమడుగు శేషాచలం అడవుల్లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సందడి చేశారు. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, ధనుష్(Dhanush) కాంబినేషన్లో వస్తున్న క్రేజీ చిత్ర షూటింగ్ ఇక్కడ శరవేగంగా జరుగుతోంది. ఎర్రచందనానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ దట్టమైన అడవుల బ్యాక్‌డ్రాప్‌లోనే ఈ సినిమా కథాంశం సాగుతుందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎర్రచందనం స్మగ్లింగ్, అక్రమ రవాణాకు సంబంధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను మరియు టాకీ పార్ట్‌ను చిత్ర యూనిట్ ఇక్కడ చిత్రీకరిస్తోంది.
Buchibabu: చరణ్ కంటి నుండి రక్తం.. పెద్దాయన ఫోన్ చేస్తే గుండె ఆగినంత పనైంది.. బుచ్చిబాబు ఎమోషనల్!
రోళ్లమడుగు పరిసర ప్రాంతాల్లో దాదాపు ఐదు రోజుల పాటు సుదీర్ఘంగా సాగేలా ఈ షూటింగ్ షెడ్యూల్‌ను మేకర్స్ ప్లాన్ చేశారు. ఇప్పటికే రెండు రోజుల పాటు అడవుల్లో హై-వోల్టేజ్ సీన్ల చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ క్రేజీ అప్డేట్ బయటకు రావడంతో, తమిళ, తెలుగు ప్రేక్షకులలో ఈ సినిమాపై సరికొత్త అంచనాలు రేకెత్తుతున్నాయి.
సినిమా షూటింగ్ నిమిత్తం హీరో ధనుష్ రాజంపేటలోని ఒక ప్రముఖ లాడ్జిలో బస చేశారు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల్లో వేగంగా వ్యాపించడంతో, తమ అభిమాన హీరోను చూడటానికి స్థానిక ప్రజలు, యువకులు లాడ్జి వద్దకు భారీగా తరలివచ్చారు. ఫ్యాన్స్ తాకిడి విపరీతంగా పెరగడంతో అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో రెండు రోజుల పాటు ధనుష్ రాజంపేటలోనే బస చేసి మిగిలిన షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నారు.
