Captain Miller : సంక్రాంతి బరి నుంచి తప్పుకొని.. రిపబ్లిక్ డేకి కెప్టెన్ మిల్లర్..

సంక్రాంతి బరి నుంచి తప్పుకొని రిపబ్లిక్ డేకి కెప్టెన్ మిల్లర్. అక్కడ 'ఫైటర్'తో పోటీ..

Captain Miller : సంక్రాంతి బరి నుంచి తప్పుకొని.. రిపబ్లిక్ డేకి కెప్టెన్ మిల్లర్..

Dhanush Shivarajkumar Sundeep Kishan Priyanka Mohan Captain Miller new Release date

Updated On : January 12, 2024 / 1:05 PM IST

Captain Miller : తమిళ్ హీరో ధనుష్ నుంచి వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ ముఖ్య పాత్రలు చేస్తుంటే.. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు. కాగా ఈ మూవీ ఈ సంక్రాంతి పండక్కే రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. అయితే తెలుగులో మొత్తం నాలుగు సినిమాలు ఉండడం, వాటికే థియేటర్స్ దొరక్కపోవడంతో కెప్టెన్ మిల్లర్ రిలీజ్ కష్టమైంది.

దీంతో తెలుగులో ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేశారు. అయితే తమిళంలో మాత్రం రిలీజ్ చేసేశారు. ప్రస్తుతం అక్కడ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఇక తెలుగు వెర్షన్ కి సంబంధించిన రిలీజ్ డేట్ పై నేడు క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి భారీ నుంచి తప్పించి రిపబ్లిక్ డేకి తీసుకు వస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.

Also read : Guntur Kaaram : ‘గుంటూరు కారం’ రివ్యూ.. పండక్కి ఘాటు ఎక్కించి.. ఎమోషన్‌తో కన్నీళ్లు తెప్పించిన బాబు..

కాగా అదే రిలీజ్ డేట్ లో హృతిక్ రోషన్ ‘ఫైటర్’ సినిమా కూడా రాబోతుంది. మరి ఫైటర్ తో కెప్టెన్ మిల్లర్ పోటీ పడి విజయం సాదిస్తాడో లేదో చూడాలి. ఇక కెప్టెన్ మిల్లర్ స్టోరీ విషయానికి వస్తే.. బ్రిటిష్ టైం పీరియడ్ లో జరుగుతుంది. బ్రిటిష్ అధికారులు మైనింగ్ చేస్తూ ఒక హిందూ గుడి వరకు రావడంతో.. అక్కడ ఉన్న ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వం పై తిరగబడతారు అనేదే కథని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది.

ధనుష్ చివరిగా ‘సార్’ సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ధనుష్ నటించిన మొదటి తెలుగు స్ట్రెయిట్ సినిమా ఇది. ఇక ఫస్ట్ మూవీతోనే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ధనుష్.. ఇక్కడ మరింత ఫ్యాన్‌డమ్ క్రియేట్ అయ్యింది. దీంతో కెప్టెన్ మిల్లర్ పై మంచి ఆసక్తే నెలకుంది. అంతేకాకుండా ఈ చిత్రంలో మన హీరో సందీప్ కిషన్, ఇటీవల కాలంలో తెలుగువారికి బాగా దగ్గరైన శివ రాజ్ కుమార్ ఉండడం కూడా సినిమా ప్లస్ గా మారింది.