‘డ్రెస్ కాదు.. మగాడి మైండ్ సెట్ మారాలి’.. పవన్ కళ్యాణ్ పాటకు స్టేజ్‌పైనే ఏడ్చేశారు..

  • Published By: sekhar ,Published On : October 30, 2020 / 06:33 PM IST
‘డ్రెస్ కాదు.. మగాడి మైండ్ సెట్ మారాలి’.. పవన్ కళ్యాణ్ పాటకు స్టేజ్‌పైనే ఏడ్చేశారు..

Updated On : October 30, 2020 / 11:38 PM IST

Dhee Champions Quarter Finals: టాలీవుడ్ పాపులర్ రియాలిటీ షో ‘ఢీ ఛాంపియన్స్’ క్వార్టర్ ఫైనల్స్ లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనికి కారణం ఈ ప్రోమో ఎంటర్ టైనింగ్‌‌గా సాగుతూ ఎమోషనల్‌గా ఎండ్ అవడమే.. కంటెస్టెంట్స్ అందరూ మంచి పాటలతో చక్కగా పెర్ఫామ్ చేశారు. కాగా ‘వకీల్ సాబ్’ సినిమాలోని ‘మగువా మగువా’ పాటకు గ్రూప్ చేసిన పెర్ఫార్మెన్స్‌కు సెట్‌లో ఉన్న ప్రియమణి, పూర్ణ, రష్మి, వర్షిణితో పాటు మిగతా ఆడవాళ్లందరూ బాగా ఎమోషనల్ అయ్యారు.



ప్రోమో చివర్లో ప్రియమణి మాట్లాడుతూ.. ‘‘సొసైటీలో ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఇటీవల ఓ వ్యక్తి సోషల్ మీడియా ఇంటర్వూలో.. ‘ఆడవాళ్లు ఎందుకు పనిచేయాలి? ఎందుకు పొట్టి దుస్తులు ధరించాలి? ఇంట్లోనే ఉంటే ఇలాంటివి జరగవు’ అని చెప్పాడు.. ఆయనే కాదు ఇంటర్వూలో పాల్గొన్న చాలామంది మగవాళ్లు ఇలాగే చెప్పారు..’’ అంటూ ప్రియమణి ఎమోషనల్ అవడంతో పక్కనే ఉన్న రష్మి, వర్షిణి కంటతడి పెట్టుకున్నారు. నవంబర్ 4న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.