Martin : ధృవ సర్జా హీరోగా కన్నడ నుంచి మరో పాన్ ఇండియా సినిమా.. KGF రేంజ్ లో పోస్టర్..
తాజాగా కన్నడ నుంచి మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా రాబోతుంది. యాక్షన్ కింగ్ అర్జున్ బంధువు హీరో ధృవ సర్జా మార్టిన్ అనే సినిమాతో రాబోతున్నాడు. గతంలోనే ఈ సినిమాని ప్రకటించినా తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేసి పాన్ ఇండియా సినిమాగా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం హిందీలలో..............

Dhruva Sarja pan india movie Martin teaser releasing on feb 23rd
Martin : ఇటీవల కన్నడ సినీ పరిశ్రమ ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు 50 కోట్ల కలెక్షన్స్ కూడా లేని కన్నడ సినిమా ఇప్పుడు వేలకోట్ల టర్నోవర్స్ చేస్తుంది. KGF సినిమాతో మొదలైన కన్నడ సినిమా ప్రభంజనం ఆగకుండా సాగుతోంది. KGF తో కన్నడ సినీ పరిశ్రమని ప్రపంచమంతటా పరిచయం చేసి KGF 2, కాంతార, విక్రాంత్ రానా సినిమాలతో వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టి ఇండియాతో పాటు విదేశాల్లోనూ కన్నడ సినిమా మంచి మార్కెట్ తెచ్చుకుంది. త్వరలో ఉపేంద్ర మరో భారీ సినిమా ‘కబ్జా’తో రాబోతున్నాడు.
తాజాగా కన్నడ నుంచి మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా రాబోతుంది. యాక్షన్ కింగ్ అర్జున్ బంధువు హీరో ధృవ సర్జా మార్టిన్ అనే సినిమాతో రాబోతున్నాడు. గతంలోనే ఈ సినిమాని ప్రకటించినా తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేసి పాన్ ఇండియా సినిమాగా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం హిందీలలో ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ సాగా అనే క్యాప్షన్ తో సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ పోస్టర్ లో ధృవ సర్జా భారీ గన్ తో బులెట్స్ కురిపిస్తూ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్నాడు.
Sai Pallavi: షాకింగ్ నిర్ణయం తీసుకున్న సాయి పల్లవి.. నిజమేనా?
మార్టిన్ సినిమా టీజర్ ని ఫిబ్రవరి 23న రిలీజ్ చేయనున్నట్టు కూడా ప్రకటించారు. ఈ పోస్టర్ చూస్తుంటే KGF రేంజ్ లో ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. అర్జున్ అనే దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా భారీగా రిలీజ్ చేయనున్నారు. KGF బాటలోనే ఈ సినిమా కూడా ఎంతటి విజయం సాధించి ఎన్ని కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.
??? ???????? ?? ??????
#?????? ?????’? ??????? ?????? ?????#MartinTeaser On Feb 23rd
ಮಾರ್ಟಿನ್- మార్టిన్- மார்ட்டின்-
മാർട്ടിൻ- मार्टिन?#ActionPrince @DhruvaSarja @I_am_Vaibhavi @ravibasrur @martinthemoviee @AP_Arjun_film pic.twitter.com/6paHirnt6e— MARTIN (@Martinthemoviee) February 15, 2023