Dil Raju : రెండో పెళ్లి పై వచ్చిన ట్రోల్స్ గురించి దిల్ రాజు కామెంట్స్.. నా భార్య అవి చూసి..
తేజస్వినిని దిల్ రాజు ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నప్పుడు వచ్చిన ట్రోల్స్ పై దిల్ రాజు కామెంట్స్ ఏంటంటే..

Dil Raju comments about his second marriage trolls in family star promotions
Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. తన మొదటి భార్య అనిత అనారోగ్య సమస్యలతో మరణించడంతో 50 ఏళ్ళ వయసులో మరో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండో పెళ్లి ప్రేమ వివాహం కావడం విశేషం. అంతేకాదు గత ఏడాది రెండో భార్య తేజస్వినితో ఓ బాబుకి కూడా జన్మానించారు. కాగా ఈ ప్రేమ పెళ్లి చేసుకోవడం పట్ల దిల్ రాజు పై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి.
గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు తన ప్రేమ గురించి చెప్పుకొచ్చారు. ఆ ఇంటర్వ్యూ తరువాత దిల్ రాజు సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఇక ట్రోల్స్ తన భార్య చూసి తనకి చూపించి బాధ పడ్డారట. అయితే దిల్ రాజు మాత్రం వాటిని చాలా స్పోర్టివ్ గా తీసుకోని పాజిటివ్ థింకింగ్ తో భార్య తేజస్వినికి సమాధానం ఇచ్చారట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది తెలుగు వారిలో.. తాను ఒక కోటి మంది ప్రజలకు ప్రొడ్యూసర్ గా తెలిసి ఉంటారు.
Also read : Rashmika Mandanna : విజయ్‌లో నాకు నచ్చేవి, నచ్చనవి అవే.. ఏంటి ఆ క్వాలిటీస్..!
వారిలో ఆ ట్రోల్స్ చేసిన వారు లేదా కామెంట్స్ చేసినవారు మహా అయితే ఒక పది వేల మంది ఉంటారు. మిగిలిన వారంతా తన ప్రేమని కామెంట్ చేయకుండా గౌరవిస్తున్న వారే కదా. కాబట్టి వీరందరూ ఇచ్చే గౌరవాన్ని పట్టించుకోకుండా, కేవలం ఆ పది వేల మంది కామెంట్స్ కి బాధపడడం అమాయకత్వం అని దిల్ రాజు జవాబు ఇచ్చారట. నెగటివిటీని చూసి బాధ పడుతూ పోజిటివిటీని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో దిల్ రాజు ఈ కామెంట్స్ చేసారు. దిల్ రాజు మాట్లాడిన ఈ మాటల్ని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. కాగా దిల్ రాజు మొదటి భార్యకి ఒక కూతురు ఉంది. ఆమె ప్రస్తుతం నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ‘బలగం’ సినిమాతో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇస్తూనే బ్లాక్ బస్టర్ హిట్టుని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మరికొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ వస్తున్నారు.
View this post on Instagram