Prabhas : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ పౌరాణిక సినిమా.. జటాయు చిత్రమేనా?

ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా రాబోతుంది. అయితే అది మాస్ సినిమా కాదు పౌరాణిక నేపథ్యంతో ఉండబోతుందట. ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతున్నాడు.

Prabhas : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ పౌరాణిక సినిమా.. జటాయు చిత్రమేనా?

Dil Raju mythology Movie with Prabhas and Prasanth Neel

Updated On : April 12, 2023 / 6:02 PM IST

Prabhas : ప్రస్తుతం పాన్ ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న చిత్రం సలార్ (Salaar). ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ కాంబినేషన్ లో మరో మూవీ ఉండబోతుంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఇటీవల నిర్మాతగా తన 20 ఏళ్ళ కెరీర్ ని పూర్తి చేసుకున్న దిల్ రాజు ట్విట్టర్ లో టాలీవుడ్ ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న ప్రభాస్ కమిట్మెంట్స్ అన్ని పూర్తి కాగానే తమ బ్యానర్ లో ఒక సినిమా ఉండబోతున్నట్లు తెలియజేశాడు.

Salaar: సెన్సేషన్‌లకు కేరాఫ్‌గా మారిన సలార్.. డిజిటల్ రైట్స్‌కే డబుల్ మ్యాజిక్..?

తాజాగా ఆ సినిమాని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయబోతున్నాడని తెలియజేయడంతో పాటు ఆ మూవీ పౌరాణిక నేపథ్యంతో ఉండబోతున్నట్లు వెల్లడించాడు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యినట్లు చెప్పుకొచ్చాడు. కాగా మొన్న ట్విట్టర్ ఇంటరాక్షన్ లో దిల్ రాజు.. తన డ్రీం ప్రాజెక్ట్ జటాయు గురించి కూడా వెల్లడించాడు. జటాయు చిత్రాన్ని త్వరలోనే మొదలు పెడతాను అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రభాస్ పౌరాణిక కథ జటాయునే అయ్యి ఉంటదని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. మరి ఇది జటాయు కథా? లేక ప్రశాంత్ నీల్ సొంత కథా? అనేది తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇక సలార్ విషయానికి వస్తే, ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుంది. జేమ్స్ బాండ్ సినిమాని చిత్రీకరించిన లొకేషన్స్ లో ప్రభాస్ పై భారీ యాక్షన్ సీన్ ని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్ పృథివిరాజ్ సుకుమారన్, టాలీవుడ్ జగ్గు భాయ్ జగపతి బాబు విలన్స్ గా కనిపించబోతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.