ఎన్టీఆర్‌తో పాన్ ఇండియా మూవీ!

  • Published By: sekhar ,Published On : December 11, 2020 / 07:51 PM IST
ఎన్టీఆర్‌తో పాన్ ఇండియా మూవీ!

Updated On : December 11, 2020 / 8:00 PM IST

Dil Raju Pan India Movie: ‘బాహుబలి’ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాకి మరింత గుర్తింపు, గౌరవం లభించాయి. మంచి పాయింట్ అయితే భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించడానికి వెనుకాడట్లేదు టాలీవుడ్ మేకర్స్..


యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా తర్వాత తారక్, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడట.


సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మంచున్నారని సమాచారం. ‘హిట్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త నిజమైతే, ఇటీవలే ‘జెర్సీ’ రీమేక్‌తో నిర్మాతగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దిల్ రాజు నిర్మించే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే అవుతోంది. అలాగే ‘బృందావనం, ‘రామయ్య వస్తావయ్యా తర్వాత ఎన్టీఆర్, దిల్ రాజు కాంబోలో తెరకెక్కబోయే సినిమా కూడా ఇదే కానుంది. శైలేష్ ప్రస్తుతం ‘హిట్’ హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.