TFCC Elections : ఉత్కంఠంగా ముగిసిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్.. సి కళ్యాణ్ పై దిల్ రాజు భారీ గెలుపు..
దిల్ రాజ్ ప్యానెల్ మరియు సి కళ్యాణ్ ప్యానల్ మధ్య ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ హోరాహోరీగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో దిల్ రాజు భారీ గెలుపుని సొంతం చేసుకున్నాడు.

Dil Raju Pannel won TFCC Elections 2023 against C Kalyan Pannel
TFCC Elections 2023 : ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారికి జరిగే ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్.. నేడు జులై 30న 2023-25 గాను జరిగాయి. ఇక ఈ ఎన్నికల్లో స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ మరియు సి కళ్యాణ్ ప్యానల్ పోటీ పడ్డారు. రాష్ట్ర ఎన్నికల మాదిరి.. బ్యానర్స్, హోర్డింగ్స్‌తో ఈ ఎలక్షన్స్ కూడా హోరాహోరీగా జరిగాయి. ఈ సారి ప్రొడ్యూసర్స్ సెక్టార్ నుండి ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ కానున్నారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్.. ఇలా దాదాపు మొత్తం సభ్యులు 3000 మంది సభ్యులు ఉన్నారు.
Ramya Krishna : తమన్నా పాటకు రమ్యకృష్ణ చిందులు.. వీడియో వైరల్
అయితే ఎగ్జిక్యూటివ్ సెక్టార్ నుంచి 16 మంది ఈసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎలెక్ట్ అయ్యారు. ఇక మిగితా సెక్టార్స్ కి నేడు ఎన్నికలు జరగ్గా.. పోలింగ్ కొన్ని మాటల యుద్ధాలతో రసవత్తరంగా జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఈ పోలింగ్ ముగిసింది. మొత్తం పోలైన ఓట్లు సంఖ్య 1,339. ప్రొడ్యూసర్స్ సెక్టార్ మొత్తం ఓట్లు 1,567 ఉంటే పోలైనవి మాత్రం 891. ప్రొడ్యూసర్స్ సెక్టార్ నుండి ప్రెసిడెంట్ ఎన్నిక అవుతున్న సమయంలో.. ఆ సెక్టార్ నుంచి సగం ఓట్లు మాత్రమే నమోదు అవ్వడం విశేషం. ఇక డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో మొత్తం 597 ఓట్లు ఉండగా పోలైనవి 380. స్టూడియో సెక్టార్ లో 98 కి 68 ఓట్లు పోలయ్యాయి.
Oppenheimer : ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆటమ్ బాంబు ఓ రేంజ్‌లో పేలింది.. రెండు వారాల్లో 100 కోట్లు..
ఇక ఈ ఎన్నికల్లో ముందు నుంచి దూకుడు చూపిస్తున్న దిల్ రాజు.. అదే దూకుడుతో గెలుపుని కూడా సొంతం చేసుకున్నాడు. కౌంటింగ్ మొదలైన దగ్గర నుంచి ప్రతి సెక్టార్ లో దిల్ రాజు ప్యానల్ లీడింగ్ తో ముందుకు సాగింది. ఈ లీడింగ్ తోనే దిల్ రాజు ప్యానల్ అత్యధిక మెజారిటీతో గెలుపొందింది. ప్రొడ్యూసర్స్ సెక్టార్ లో 12కి 7 పోస్టులు, స్టూడియో సెక్టార్ లో 4కి 3 పోస్టులు, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో 12కి 6 పోస్టులు గెలుచుకున్నారు. దీంతో ఫిలిం ఛాంబర్ వద్ద దిల్ రాజు ప్యానల్ హడావుడి కనిపిస్తుంది.
కాగా ఇరు ప్యానల్స్ ఇచ్చి హామీలు ఏంటో ఒకసారి చూడండి.
దిల్ రాజు ప్యానల్..
=> ఛాంబర్ బైలాలో మార్పులు జరగాలి.
=> పరిశ్రమ అభివృద్ధి, సంక్షేమం.
=> ప్రభుత్వాలతో ఎగ్జిబిటర్ల సమస్యలపై పక్కా ప్రణాళిక.
సి కళ్యాణ్ ప్యానల్..
=> చిన్న సినిమాల మనుగడ.
=> డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మనుగడ.
=> ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారం.