Dil Raju : సీఎం జగన్ మావయ్య ఫోన్ చేసి.. సినిమా అదిరిపోయిందని చెప్పారు..

సీఎం జగన్ మావయ్య ఫోన్ చేసి దిల్ రాజుకి సినిమా అదిరిపోయిందని చెప్పారట. వైరల్ అవుతున్న వీడియో.

Dil Raju said ys jagan mohan reddy uncle calls to him about movie result

Dil Raju : దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. పరుశురామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రేపు తెలుగు, తమిళంలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. దీంతో మూవీ టీం కొన్ని రోజుల నుంచి ప్రమోషన్స్ తో సందడి చేస్తుంది. తాజాగా దిల్ రాజు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ కి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో తాను గతంలో నిర్మించిన ‘బొమ్మరిల్లు’ సినిమా గురించి మాట్లాడుతూ.. “బొమ్మరిల్లు సినిమా విడుదల అయ్యినప్పుడు ప్రేక్షకుల రియాక్షన్ చూడడం కోసం శాంతి థియేటర్ వెళ్ళాను. థియేటర్ లోని వారంతా సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో నాకు రాయలసీమ నుంచి ఓ ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్ మావయ్య. ఆయనకు అక్కడ థియేటర్ ఉంది. ఇక సినిమా చూసిన ఆయన దాని గురించి మాట్లాడుతూ.. ఏం సినిమా తీశారండి అదిరిపోయింది అంటూ గొప్పగా మాట్లాడుతున్నారు. రాయలసీమ వంటి మాస్ ఏరియాల్లో కూడా బొమ్మరిల్లు బాగా నచ్చేయడంతో నేను బాగా హ్యాపీ ఫీల్ అయ్యా” అంటూ చెప్పుకొచ్చారు.

Also read : Dil Raju : రెండో పెళ్లి పై వచ్చిన ట్రోల్స్ గురించి దిల్ రాజు కామెంట్స్.. నా భార్య అవి చూసి..

ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాని కూడా అలాగే అన్ని ఏరియాలు వారు ఇష్టపడతారని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఫ్యామిలీ స్టార్ నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ అండ్ ట్రైలర్స్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి. గీతగోవిందం తరువాత విజయ్ అండ్ పరుశురాం నుంచి వస్తున్న సినిమా కావడంతో మూవీ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి రేపు థియేటర్స్ లో ఈ సినిమా ఎలా ఆకట్టుకుందో చూడాలి.