Dimple hayathi : రవితేజ ‘ఖిలాడీ’ భామ డింపుల్ హయాతికి కరోనా

డింపుల్ హయాతి తనకి కరోనా సోకినట్లు స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ''అన్ని ముందు జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ నాకు క‌రోనా సోకింది. కొన్ని స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మిన‌హా....

Dimple hayathi : రవితేజ ‘ఖిలాడీ’ భామ డింపుల్ హయాతికి కరోనా

Dimple Hayathi (1)

Updated On : January 17, 2022 / 11:12 AM IST

Dimple hayathi :   ఇటీవల రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు, మలయాళం స్టార్లు చాలా మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా రవితేజ సరసన ‘ఖిలాడీ’లో నటించిన డింపుల్ హయాతి కరోనా బారిన పడ్డారు. ‘గద్దలకొండ గణేష్’లో ఐటెం సాంగ్ చేసిన డింపుల్ హయాతి ప్రస్తుతం రవితేజ సరసన ఖిలాడీలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి ఉంది.

Allu sirish : జనాలు ‘ఆహా’కి నాకు సంబంధం ఉంది అనుకుంటున్నారు

డింపుల్ హయాతి తనకి కరోనా సోకినట్లు స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ”అన్ని ముందు జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ నాకు క‌రోనా సోకింది. కొన్ని స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మిన‌హా ప్ర‌స్తుతం నేను బాగానే ఉన్నాను. ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నాను. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాను కాబ‌ట్టే ఇది పెద్ద‌గా న‌న్ను ఇబ్బంది పెట్ట‌ట్లేదు. అందుకే ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌కుండా వ్యాక్సిన్ వేసుకోండి, మాస్కులు ధ‌రించండి, సానిటైజ‌ర్ వాడండి. త్వ‌రలోనే మ‌రింత స్ట్రాంగ్‌గా తిరిగొస్తాను’అని హయాతి పోస్ట్ చేసింది.

View this post on Instagram

A post shared by Dimple Hayathi (@dimplehayathi)