ఇంట్లో వాళ్ళకి కొంత ఫ్రస్ట్రేషన్ రిలీఫ్, మనకి కొంత ఫన్ : అనిల్ రావిపూడి….

ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనకు విసిరిన ‘బీ ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌ని సక్సెస్ఫుల్‌గా పూర్తి చేసిన విక్టరీ వెంకటేష్, దానిని సూపర్ స్టార్ మహేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడిలకు విసరగా.. తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి తనకు ఎదురైన ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతోన్న ఛాలెంజ్ ‘బీ ద రియల్ మేన్’. ఇప్పటివరకు చిరంజీవి, వెంకటేశ్, రాజమౌళి, తారక్, ఎన్టీఆర్, ఎం.ఎం.కీరవాణి, క్రిష్, సుకుమార్, శోభు యార్లగడ్డ తదితరులు ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.
వీరు తమ ఇంట్లోని పనులు చేయడమే కాకుండా ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలంటూ మరికొందరినీ నామినేట్ చేస్తున్నారు. ఇప్పుడు ‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు అనిల్. ‘వివాహ భోజనంబు’ సినిమాలోని కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో అనీల్ రావిపూడి తన ఛాలెంజ్‌ను పూర్తి చేయడం విశేషం. తర్వాత ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలంటూ మాస్‌రాజా రవితేజ, నందమూరి కల్యాణ్‌రామ్, సాయితేజ్‌లను నామినేట్ చేశారు.