Anil Ravipudi : అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామాయణం ప్రాజెక్టు.!
అనిల్ రావిపూడి (Anil Ravipudi ) దర్శకత్వంలో రామాయణం నేపథ్యంలో ఒక భారీ యానిమేటెడ్ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతోంది.
Director Anil Ravipudi Ramayanam Project film
Anil Ravipudi : అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామాయణం నేపథ్యంలో ఒక భారీ యానిమేటెడ్ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-విజువలైజేషన్ పనులు పూర్తయ్యాయని, కథకు సెట్ అయ్యేలా యానిమేషన్, భారీ విజువల్ స్కేల్లో డిజైన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సాధారణంగా తన సినిమాల్లో కామెడీ, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను బలంగా చూపించే అనిల్ రావిపూడి..రామాయణం లాంటి పౌరాణిక కథను యానిమేటెడ్ ఫార్మాట్లో ఎలా ఆవిష్కరించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు, యుద్ధ ఘట్టాలు, లంక, అయోధ్య, వానరసేన, రామసేతు వంటి కీలకమైన అంశాలను ఆధునిక యానిమేషన్ టెక్నాలజీతో అంతర్జాతీయ స్థాయిలో చూపించేలా ప్రీవిజువలైజేషన్ చేసినట్లు టాక్.
ఈ ప్రాజెక్ట్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించబోతున్నట్లు, గౌర హరి మ్యూజిక్ అందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ముఖ్యంగా యానిమేటెడ్ చిత్రంగా రూపొందితే తెలుగు మాత్రమే కాకుండా ఇతర పాన్ ఇండియా సినిమాగా రావడంతో పాటు, ఇంటర్నేషనల్ మార్కెట్‌ను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
ప్రీవిజువలైజేషన్ పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి నుంచి పూర్తిగా భిన్నమైన జానర్లో రామాయణం వస్తుందనే వార్త నిజమైతే..ఆయన కెరీర్లోనే ఒక కొత్త ప్రయోగంగా నిలిచే అవకాశం ఉంది
