Jawan : జవాన్ యాక్షన్ సీన్ ఎలా షూట్ చేసారో చూశారా..? కారుని గాలిలోకి..!

జవాన్ BTS వీడియోని షేర్ చేసిన డైరెక్టర్ అట్లీ. ఆ వీడియోలో మూవీలోని ఒక కార్ యాక్షన్ సీక్వెన్స్ సీన్..

Jawan : జవాన్ యాక్షన్ సీన్ ఎలా షూట్ చేసారో చూశారా..? కారుని గాలిలోకి..!

Director Atlee shares a Shah Rukh Khan Jawan BTS video

Updated On : September 26, 2023 / 4:12 PM IST

Jawan : షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘జవాన్’. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నయనతార (Nayanathara) హీరోయిన్ గా, విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విలన్ గా, ప్రియమణి, దీపికా పదుకొనే.. మరికొంతమంది స్టార్స్ ముఖ్య పాత్రలు చేశారు. తమిళ రాక్ స్టార్ అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ముందుకు వెళ్తుంది.

Swathi Reddy : విడాకుల వార్తలు పై నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి.. సీరియస్ అయిన స్వాతి..

ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న అట్లీ.. షూటింగ్ సమయంలో కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. ఈక్రమంలోనే తాజాగా ఒక BTS వీడియోని షేర్ చేశాడు. ఆ వీడియోలో మూవీలోని ఒక కార్ యాక్షన్ సీక్వెన్స్ సీన్ ఎలా చిత్రీకరించారు అనేది చూపించాడు. ఈ సీన్ అంతా హాలీవుడ్ టెక్నీషియన్స్ తో తెరకెక్కించారని వీడియో చూస్తుంటే తెలుస్తుంది. మరి యాక్షన్ సీన్ చిత్రీకరణ ఒకసారి మీరుకూడా చూసేయండి.

Waheeda Rehman : సినీ అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2021.. ఎంపికైన బాలీవుడ్ సీనియర్ నటి..

 

View this post on Instagram

 

A post shared by Atlee (@atlee47)

కాగా ఈ మూవీ రీసెంట్ గా రూ.1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా రూ.1004.92 కోట్ల కలెక్షన్స్ ని అందుకుందని అట్లీ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. జవాన్ కూడా వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో షారుఖ్ కొత్త రికార్డుని సృష్టించినట్లు అయ్యింది. ఇప్పటివరకు షారుఖ్ తో పాటు ప్రభాస్, యశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వెయ్య కోట్లు మార్క్ ని అందుకున్నారు. అయితే వీరందరికి వెయ్యి కోట్ల క్లబ్ లో ఒక సినిమా మాత్రమే ఉంది. షారుఖ్ ఇప్పుడు జవాన్ తో కూడా ఆ మార్క్ ని రెండోసారి అందుకొని.. రెండు వెయ్యి కోట్ల మూవీస్ ఉన్న హీరోగా రికార్డు సృష్టించాడు.