Director Bobby : ఇండస్ట్రీకి పదేళ్లు దూరమై మళ్ళీ వచ్చినా ఆయన చైర్ ఆయనకే ఉంది

ఈవెంట్ లో డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ..''ఎక్కడో గుంటూరులో చిరంజీవి గారి సినిమాలకి బ్యానర్లు కట్టి హడావిడి చేసే నేను ఆయన మీద ఉన్న పిచ్చతో హైదరాబాద్ కి..............

Director Bobby : ఇండస్ట్రీకి పదేళ్లు దూరమై మళ్ళీ వచ్చినా ఆయన చైర్ ఆయనకే ఉంది

Bobby

Updated On : April 23, 2022 / 9:16 PM IST

 

Director Bobby :  మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వనుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటించగా కొణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా సినిమాని నిర్మించారు. ఆచార్య సినిమాకి సంబంధించి మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ(ఏప్రిల్ 23న) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగింది. ఈ ఈవెంట్ కి మెగా అభిమానులు భారీగా తరలి వచ్చారు.

 

ఈ ఈవెంట్ లో డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ..”ఎక్కడో గుంటూరులో చిరంజీవి గారి సినిమాలకి బ్యానర్లు కట్టి హడావిడి చేసే నేను ఆయన మీద ఉన్న పిచ్చతో హైదరాబాద్ కి రావడం. మెల్లి మెల్లిగా ఇప్పుడు స్టేజి మీదకి వచ్చి మైక్ పట్టుకునే దాకా వచ్చేశాను. మీ కథ రాసే విధానం అద్భుతం కొరటాల శివ గారు. మీ కథలో ఉండే ఎమోషన్ తో అందర్నీ కనెక్ట్ చేస్తారు. చిరంజీవి, చరణ్ ని కలిపి మా లాంటి అభినులకి కన్నుల పండగ ఇచ్చిన కొరటాల గారికి థ్యాంక్స్. చిరంజీవి గారు ఎందుకు మెగాస్టార్ అయ్యారా అనేది ఇప్పుడు సెట్ లో ఆయనతో వర్క్ చేస్తుంటే తెలుస్తుంది. చెప్పిన టైం కంటే సెట్ లో ముందు ఉంటారు. నేను ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షో చూసి పొద్దున్నే సెట్ లో చిరంజీవి గారికి చరణ్ బాగా చేశారు అని చెప్తుంటే ఆయన చరణ్ తో పాటు తారక్ కూడా అద్భుతంగా చేసాడు అన్నారు. ఇందుకు ఆయన మెగాస్టార్ అయ్యారు. ఇంద్ర సినిమాలో చైర్ కి దూరమై మళ్ళీ వస్తే ఆ చైర్ ఆయనకే ఉంటుంది. అలాగే ఇండస్ట్రీ నుంచి పదేళ్లు దూరమై మళ్ళీ వచ్చినా ఆయన చైర్ ఆయనకే ఉంది. మెగా ఫ్యాన్ లాగా ఈ సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. వాళ్లిద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ చూశాను. బాస్ గ్రేస్ ఆల్వేస్ గ్రేట్. టెక్నీషియన్స్ అందరూ బాగా వర్క్ చేశారు సినిమాకి. రాజమౌళి గారి వాళ్ళ తెలుగు సినిమాకి ముంబైలో రెస్పెక్ట్ ఇస్తున్నారు” అని తెలిపారు.

Mehar Ramesh : చిరంజీవి, చరణ్ కలిసి చేసిన డ్యాన్స్ చూస్తుంటే శివుడు, కుమార స్వామితో కలిసి నాట్యం చేసినట్టు ఉంది

ఇప్పటికే ఈ సినిమా నుంచి లాహే లాహె, నీలాంబరి, సానా కష్టం, భలే భలే బంజారా లిరికల్ సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయి భారీ స్పందన తెచ్చుకున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఆచార్య సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.