అది విరాళం.. రౌడీ మామూలు కాదు – దర్శకుడు దేవ కట్టా

కరోనా లాక్‌డౌన్ : విరిళాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు దేవ కట్టా..

  • Published By: sekhar ,Published On : March 31, 2020 / 01:44 PM IST
అది విరాళం.. రౌడీ మామూలు కాదు – దర్శకుడు దేవ కట్టా

Updated On : March 31, 2020 / 1:44 PM IST

కరోనా లాక్‌డౌన్ : విరిళాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు దేవ కట్టా..

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా యావత్ భారతదేశం మొత్తం లాక్‌డౌన్ అయిన నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తమకు చేతనైనంత ఆర్థిక సహాయంతో పాటు పలు విధాలుగా చేయూతనందిస్తున్నారు. సినిమా రంగంలో పెద్ద మొత్తంలో సహాయం చేసిన వారిని ప్రశంసిస్తూనే.. చిన్న అమౌంట్ ఇచ్చిన వారిని, ఇప్పటి వరకు సహాయం చేయనివారిని టార్గెట్ చేస్తూ తీవ్రంగా విమర్శిస్తున్నారు నెటిజన్లు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శకుడు దేవ కట్టా తాజాగా చేసిన ట్వీట్ ఒకటి చర్చనీయాంశమైంది. ‘ప్రస్తుత లాక్‌డౌన్, ఇతర విపత్కర సమయాల్లో తమకు చేతనైనంత సహాయం చేసే ఇండస్ట్రీ మనుషుల గురించి నాకు తెలుసు. కానీ, వాళ్లలో చాలామంది పబ్లిసిటీ కోరుకోరు. తమ సహాయాన్ని వారు వ్యక్తిగతంగానే చూస్తారు. గోప్యంగా ఉంచడానికే ఇష్టపడతారు. మరికొందరు తమ సహాయం గురించి ప్రకటిస్తారు. దాని వెనుక కూడా ఓ కారణం ఉంది.

Read Also : అదరగొడుతున్న ‘ఆహా’ – వన్ మిలియన్ యూప్ డౌన్‌లోడ్స్

తమ సహాయం మరికొందరికి స్ఫూర్తినిచ్చి వారు కూడా ముందుకొస్తారని పబ్లిసిటీ చేస్తారు. బయటకు చెప్పని వారి గురించి తప్పుగా అనుకోవడం సరికాదు. విరాళం అనేది బలవంతంగా వసూలు చేసే రౌడీ మామూలు కాదు’ అని ట్వీట్ చేసాడు. తెలుగులో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘ప్రస్థానం’ చిత్రాన్ని సంజయ్ దత్‌తో హిందీలో తెరకెక్కించిన దేవ కట్టా ప్రస్తుతం సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైంది.