Raviteja Son: మాస్‌రాజా వారసుడితో హరీష్ శంకర్.. ఏంటీ కథ?

కరోనాకు ముందు వరకు సక్సెస్ కోసం ఫీట్లు చేసిన మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ మీదున్నాడు. వరసగా సినిమాలను పూర్తిచేస్తూ యంగ్ హీరోలకు కాంపిటీషన్ ఇస్తున్నాడు.

Raviteja Son: మాస్‌రాజా వారసుడితో హరీష్ శంకర్.. ఏంటీ కథ?

Raviteja Son

Updated On : November 8, 2021 / 12:51 PM IST

Raviteja Son: కరోనాకు ముందు వరకు సక్సెస్ కోసం ఫీట్లు చేసిన మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ మీదున్నాడు. వరసగా సినిమాలను పూర్తిచేస్తూ యంగ్ హీరోలకు కాంపిటీషన్ ఇస్తున్నాడు. క్రాక్ సినిమాతో రవితేజ ఈ ఏడాది తొలి సక్సెస్ కొట్టడమే కాదు.. కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమాకు వస్తారనే నమ్మకాన్ని కూడా కలిగించాడు. అక్కడ నుండి మొదలైన రవితేజ హవా వరస సినిమాలతో ఎక్కడా ఆగడం లేదు. ప్రస్తుతం నాలుగు సినిమాలు లైన్లో పెట్టేశాడు.

Sakshi Malik: సోషల్ మీడియా ‘సాక్షి’గా అందాల జాతర

ప్రస్తుతం రవితేజ నటించిన ‘ఖిలాడీ’ సినిమా విడుదలకి సిద్దమవగా.. రామారావు ఆన్ డ్యూటీ సినిమా ముమ్మర షూటింగ్ లో ఉంది. నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు ఈ మధ్యనే తన 70వ సినిమాను కూడా ప్రకటించాడు. ఇలా వరసగా సినిమాలను చేస్తున్న రవితేజ ఇప్పుడు వారసుడి అరంగేట్రానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడా అనే చర్చలు మొదలయ్యాయి. దీనికి కారణం రవితేజ కుమారుడు మహాధన్ ఇప్పుడు తొలిసారి కెమెరా ముందుకు రావడమే.

Kamna Jethmalani: సొగసుల సుందరి సొట్టబుగ్గల కామ్నా!

తాజాగా దర్శకుడు హ‌రీష్ శంక‌ర్‌.. ర‌వితేజ త‌న‌యుడు మ‌హాధ‌న్ క‌లిసి దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు రవితేజ తన కుటుంబాన్ని ఎక్కడా పెద్దగా పరిచయం చేయలేదు. అయితే.. మహాధన్ మాత్రం నటుడు కావాలనే నిర్ణయానికి రావడంతో ఇప్పుడు రవితేజ కూడా కొడుకు కోసం ఆ ప్రయత్నాలు సిద్ధం చేసినట్లుగా భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌హాధ‌న్ తొలి సినిమా హ‌రీష్ శంక‌ర్ డైరెక్ట్ చేయ‌నున్నాడనే కథనాలు మొదలయ్యాయి. మరి ఇది ఎంతవరకు నిజమన్నది చూడాలి.