Siddu Jonnalagadda: జాక్ డిజాస్టర్ తరువాత కొరటాల శివ కాల్ చేశారు.. ఆ రెండిటి మధ్యలో ఒకటి.. తన కథనే చెప్పాడా?
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ "తెలుసు కదా". దర్శకురాలు నీరజ (Siddu Jonnalagadda)కోన తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Director Koratala Siva called Siddu Jonnalagadda after the Jack disaster
Siddu Jonnalagadda: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ “తెలుసు కదా”. దర్శకురాలు నీరజ కోన తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.(Siddu Jonnalagadda) నిజానికి ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగా కట్ చేశారు. ట్రయాంగిల్ లవ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఓపక్క రెలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు మేకర్స్.
ఈనేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దు జొన్నలగడ్డ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన గత సినిమా జాక్ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయ్యాక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సిద్దుకి కాల్ చేసి మాట్లాడాడట.. “టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ చూశావ్. ఇప్పుడు జాక్ తో డిజాస్టర్ చూశావ్. ఇంకా ఫ్యూచర్ లో ఎం చూసినా ఈ రెండిటి మధ్యలోనే ఉంటాయి” అంటూ చెప్పుకొచ్చాడట. కొరటాల చెప్పిన ఈ మాటలు సిద్దుకి చాలా మోటివేషనల్ గా అనిపించాయట. అప్పనుంచి తరువాతి సినిమాల గురించి ఎక్కువగా ఆలోచించడం మానేశాడట. కేవలం మంచి సినిమాలు చేయాలనే ఆలోచనతో ముందుకు వెళుతున్నాడట.
అయితే, సిద్దు చెప్పిన కామెంట్స్ విన్న నెటిజన్స్ చాలా మంది కొరటాల శివ తన కథనే సిద్దు జొన్నలగడ్డకి చెప్పాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎలా అంటే, దర్శకుడు కొరటాల శివ కూడా మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ చూశాడు. మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య లాంటి డిజాస్టర్ కూడా చేశాడు. ఆ తరువాత దేవర చేసి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. కాబట్టి, తన లైఫ్ లో జరిగిన దానినే సిద్దుకి మోటివేషన్ ఇచ్చేందుకు వాడేశాడు కొరటాల అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా గమనిస్తే నిజమే కదా అనిపిస్తుంది. మరి కొరటాల చెప్పినట్టుగా సిద్దు తెలుసు కదా సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో చూడాలి.