Prabhas: నోరుజారిన ప్రదీప్.. ప్రభాస్ నెక్స్ట్ మూవీ టైటిల్ చెప్పేశాడు.. కొన్ని సీన్స్ కూడా చూశాడట.. ఇంకా ఏమన్నాడంటే..
డ్యూడ్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు తమిళ హీరో(Prabhas) ప్రదీప్ రంగనాథన్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Hero Pradeep Ranganathan leaks the title of Prabhas' next movie
Prabhas: డ్యూడ్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. యూత్ ఫుల్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి అదిరిపోయే(Prabhas) రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో, ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచిన టీం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
Salman-Dil Raju: సల్మాన్ తో దిల్ రాజు మూవీ.. డైరెక్టర్స్ ఎవరు దొరకడం లేదా.. మళ్ళీ అతనే..
ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో ప్రదీప్ రంగనాథన్ నోరు జారాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న నెక్స్ట్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు… ప్రభాస్-హను రాఘవపూడి సినిమా. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. “నేను ప్రభాస్ హీరోగా చేస్తున్న “ఫౌజీ” సినిమాలో కొన్ని సీన్స్ చూశాను. ఆ సీన్స్ షాక్ అయ్యేలా ఉన్నాయి. అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో, ప్రదీప్ రంగనాథన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిజానికి, ప్రభాస్ దర్శకుడు హను రాఘవపూడితో సినిమా ఒక సినిమా చేస్తున్నాడు అని తెలుసు. రెండో ప్రపంచయుద్ధం బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్ ఇదే అని మేకర్స్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ, “ఫౌజీ” టైటిల్ ఫిక్స్ చేసే అవకాశం ఉందనే ఉహాగానాలు వ్యక్తం అవుతూవస్తున్నాయి. కానీ, ఇప్పుడు అదే టైటిల్ అంటూ ప్రదీప్ కన్ఫర్మ్ చేశేశాడు. దీంతో, ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ కటౌట్ కి పర్ఫెక్ట్ టైటిల్ ఇదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, టైటిల్ చెప్పి అందరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రదీప్ కి థాంక్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి, దీనిపై “ఫౌజీ” సినిమా మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.