పవన్ ఫ్యాన్స్ అందరికీ క్రిష్ ఛాలెంజ్.. ఏం చేస్తారో మరి!

‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్ టాలీవుడ్‌లో బాగా పాపులర్ అయింది. సందీప్ రెడ్డి వంగా నుంచి ప్రారంభమైన ఈ ఛాలెంజ్ ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ వరకు వెళుతుంది. సందీప్ విసిరిన ఛాలెంజ్‌ను రాజమౌళి విజయవంతంగా పూర్తి చేసి.. ఆ తర్వాత తారక్, రామ్ చరణ్, నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకుడు సుకుమార్, అలాగే తన పెద్దన్న ఎమ్.ఎమ్. కీరవాణిలను నామినేట్ చేశారు. వారంతా ఈ ఛాలెంజ్ స్వీకరించి మరికొందరినీ ఈ ఛాలెంజ్‌కు ఆహ్వానించారు. ఇప్పుడు కీరవాణి విసిరిన ఛాలెంజ్‌ను డైరెక్టర్ క్రిష్ స్వీకరించడమే కాకుండా.. తనవంతుగా ఈ ఛాలెంజ్‌ను మరింత పెద్ద లెవల్‌కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
తాజాగా కీరవాణి ఇచ్చిన టాస్క్‌ని పూర్తి చేసిన క్రిష్.. ఆ టాస్క్ తాలూకూ వీడియో పోస్ట్ చేసి.. ‘‘కీరవాణిగారూ మీరిచ్చిన టాస్క్ పూర్తి చేశాను. ఇప్పుడు నేను ఈ ఛాలెంజ్‌కు ప్రపంచంలోని పవన్ కల్యాణ్ అభిమానులందరినీ నామినేట్ చేస్తున్నాను. ‘బీ ద రియల్ మేన్’ సవాలును స్వీకరించి ఇంటిలోని ఆడవారికి సహాయం చేయండి..’’ అని క్రిష్ పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కనుక ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తే ఆ కిక్కు వేరేలా ఉంటుందని కొత్తగా చెప్పనవసరం లేదు కదా.
Here you go @mmkeeravaani sir .. and I’m nominating each n every #PSPKFan all over the world for the #BeTheRealMan challenge in helping our women in household chores. pic.twitter.com/5tXi1i7lQP
— Krish Jagarlamudi (@DirKrish) April 23, 2020