క్రిష్ కొత్త సినిమా స్టార్ట్ చేసేశాడు!.. మరి పవన్ సినిమా?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఒక షెడ్యూల్ జరిగింది. కరోనా కారణంగా షూటింగ్‌కి లాంగ్ గ్యాప్ రావడంతో డైరెక్టర్ క్రిష్ ఇంకో సినిమా స్టార్ట్ చేసేశాడు.
తొలి సినిమా ‘ఉప్పెన’ విడుదల కాకముందే మెగా ఫ్యామిలీ హీరో పంజా వైష్ణవ్ తేజ్ మరో మంచి అవకాశం దక్కించుకున్నాడు. క్రిష్ రూపొందిస్తున్న సినిమాలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ రోజు (శుక్రవారం) ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. నల్లమల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోయే ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్‌లో అంటే అక్టోబర్ చివరి కల్లా పూర్తి చేయాలని క్రిష్ భావిస్తున్నారు. నవంబర్ నుంచి పవన్ కల్యాణ్ సినిమాను పట్టాలెక్కించాలనుకుంటున్నారు.