Mahi V Raghav : డబ్బున్న ప్రతివాడు నన్ను బయోపిక్ తీయమని అడుగుతున్నాడు.. ఇకపై నేను బయోపిక్స్ తీయను..

తాజాగా యాత్ర 2 సినిమా మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సినిమాని 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

Mahi V Raghav : డబ్బున్న ప్రతివాడు నన్ను బయోపిక్ తీయమని అడుగుతున్నాడు.. ఇకపై నేను బయోపిక్స్ తీయను..

Director Mahi V Raghav Comments on Biopics

Updated On : July 9, 2023 / 9:25 AM IST

Director Mahi V Raghav :  గతంలో YSR బయోపిక్ యాత్ర సినిమాతో మెప్పించిన డైరెక్టర్ మహి v రాఘవ్ ఆ తర్వాత పలు సిరీస్ లు, సినిమాలు చేశారు. యాత్ర సినిమా గత ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేసి మంచి విజయం సాధించారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ టైంలోనే యాత్ర 2 సినిమాతో రాబోతున్నారు. తాజాగా యాత్ర 2 సినిమా మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సినిమాని 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

ఈ ప్రెస్ మీట్ లో విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు డైరెక్టర్. ఇందులో భాగంగానే దీని తర్వాత ఇంకెవరి బయోపిక్స్ అయినా తీస్తారా? పవన్ కళ్యాణ్, చంద్రబాబు బయోపిక్ లు ఏమైనా తీసే ఉద్దేశం ఉందా? ఎవరైనా మిమ్మల్ని బయోపిక్ తీయమని అడిగితే తీస్తారా అని ప్రశ్నించారు.

Kichcha Sudeep : అబద్దపు ఆరోపణలు అంటూ.. ఆ నిర్మాతపై 10 కోట్ల పరువు నష్టం దావా వేసిన కిచ్చ సుదీప్..

దీనికి డైరెక్టర్ మహి v రాఘవ్ సమాధానమిస్తూ.. ఇకపై నేను మళ్ళీ పొలిటికల్ ఫిలిం చేయకపోవచ్చు. నేను యాత్ర సినిమా చేసినందుకే ప్రతి ఒక్కరూ నన్ను బయోపిక్ చేయమంటున్నారు. 500 కోట్లు సంపాదించిన వాడు వచ్చి అతని కథని బయోపిక్ గా తీయమని అడుగుతున్నాడు. ఇకపై నేను బయోపిక్ లు, రాజకీయ కథలు తీయను. యాత్ర 2 ఇదే నా లాస్ట్ పొలిటికల్ ఫిలిం అవ్వొచ్చు అని అన్నారు. దీంతో ఈ డైరెక్టర్ ని బయోపిక్ తీయమని ఎవరెవరు అడిగారో అని ఆలోచిస్తున్నారు ప్రేక్షకులు.