ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడని పాయింట్‌తో ‘ప్రతిరోజూ పండగే’

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ప్రతిరోజూ పండగే’.. ‘ఓ బావా’ లిరికల్ సాంగ్ రిలీజ్ సందర్భంగా మీడియాతో మూవీ యూనిట్ పలు విశేషాలు వెల్లడించారు..

  • Published By: sekhar ,Published On : November 19, 2019 / 11:14 AM IST
ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడని పాయింట్‌తో ‘ప్రతిరోజూ పండగే’

Updated On : November 19, 2019 / 11:14 AM IST

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ప్రతిరోజూ పండగే’.. ‘ఓ బావా’ లిరికల్ సాంగ్ రిలీజ్ సందర్భంగా మీడియాతో మూవీ యూనిట్ పలు విశేషాలు వెల్లడించారు..

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో.. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన ‘పది మంది ఉండగా.. ‘ప్రతిరోజూ పండగే’.. టైటిల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం సాయంత్రం ‘ఓ బావా’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మూవీ టీమ్ పలు విశేషాలు వెల్లడించారు.  

సుప్రీం హీరో సాయి తేజ్ మాట్లాడుతూ : ”సినిమాస్టార్ట్ చేసిన దగ్గరినుండి మంచి సపోర్ట్ అందిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ అదరగొట్టేశాడు. మాకు అందరికీ ఇంత ఎనర్జీ రావడానికి కారణం థమన్. ఐదు పాటలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మారుతి గారు ఫస్ట్ నాకు ఒక పదిహేను నిమిషాల స్టోరీ లైన్ చెప్పారు. చాలా బాగుంది అన్నాను. తర్వాత ఒక వారం రోజుల్లోనే పూర్తి స్క్రిప్ట్ డెవలప్ చేసి చెప్పారు. నాతో పాటు సత్య రాజ్, రావు రమేష్, విజయ్ కుమార్, మురళి శర్మ, అజయ్ ఇలా ప్రతి క్యారెక్టర్‌కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. రాశీ క్యారెక్టర్ ప్రజెంట్ టిక్ టాక్ ట్రెండ్ నుండి తీసుకోవడం జరిగింది. బెల్లం శ్రీదేవి తర్వాత మళ్ళీ ఈ సినిమాలో తను చేసిన ‘ఏంజెలా’ క్యారెక్టర్ అందరికీ గుర్తిండిపోతుంది. సినిమాలో మారుతి గారు నాకెలాంటి డిజార్డర్ పెట్టలేదు.. ఇదొక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్” అన్నారు. 

Read Also : ‘సూరరై పోట్రు’ కోసం ర్యాప్ పాడిన సూర్య

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ : ”లాస్ట్ ఇయర్ తర్వాత ఏదయినా మంచి సినిమా తీయాలి అని రకరకాల కథలు అనుకోవడం జరిగింది. అనుకోకుండా కుటుంబకథా చిత్రం తీసుకోవడం జరిగింది. ఫ్యామిలీ సినిమా అనగానే సోషల్ మీడియాలో గతంలో వచ్చిన కుటుంబకథాచిత్రాలతో పోల్చడం పరిపాటి అయిపోయింది. అయితే ఇండియన్ స్క్రీన్ మీద ఇంతవరకూ రాని పాయింట్‌తో ‘ప్రతిరోజూ పండగే’ తెరకెక్కించా.. చాలా మంచి విషయాన్ని ఎంటర్‌టైన్ చేస్తూ చెప్పడం జరిగింది. పుట్టినప్పుడు ఎలాగైతే సెలబ్రేషన్ చేస్తామో అలాగే ఒక వ్యక్తి చనిపోతున్నాడు అని తెలిసినప్పుడు కూడా సంతోషంగా తనకి బెస్ట్ సెండాఫ్ ఇవ్వడం అనేది కూడా మన భాద్యతే అనే పాయింట్‌ని అంతర్గతంగా చెప్పడం జరిగింది. ప్రస్తుత సమాజంలో తన తండ్రికి పంచాల్సిన ప్రేమను కూడా తమ పిల్లలకు పంచుతున్నారు. తండ్రిని మర్చిపోతున్నారు.

అలాంటి సందర్భంలో తండ్రికి ఎంత వాల్యూ ఇవ్వాలనేది ఎంటర్‌టైన్ చేస్తూ కచ్చితంగా అందరికీ నచ్చే విధంగా హార్ట్ టచింగ్‌గా ఉండేలా సినిమా తీశాం. కొన్ని సీన్లు ఎడిట్ చేసేటప్పుడు సత్యరాజ్ గారి నటన చూస్తే నాకే కన్నీళ్లు వచ్చాయి. రేపు థియేటర్స్‌లో ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. ఇంత మంచి కథ యాక్సెప్ట్ చేసిన తేజు, రాశీలకు థ్యాంక్స్. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా అందించాలని మా టీమ్ అందరూ ఎంతో కష్టపడి పని చేశారు. అలాగే ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చిన నా స్నేహితులు బన్నీ వాసు, వంశీ, విక్కీలకు థ్యాంక్స్.

అలాగే మా మెయిన్ పిల్లర్ అరవింద్ గారు ఆయనకు కథ చెప్పగానే మంచి కథ, చాలా మంచి పాయింట్ తీసుకున్నావ్. మంచి ఫీల్ ఉంది డెఫినెట్‌గా చేద్దాం అని అన్నారు. అలా ప్రతి ఒక్కరికీ నచ్చి ప్రేమించి చేసిన సినిమా ఇది. నా ‘భలే భలే మగాడివోయ్’ స్క్రిప్ట్ మొదట చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ‘ప్రతిరోజూ పండగే’ స్క్రిప్ట్ కూడా చిరంజీవి గారికి చెప్పాను. మంచి హెల్దీ స్క్రిప్ట్ తీసుకున్నావ్ అన్నారు. ఆయన ఇచ్చిన ఎనర్జీతో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం. మంచి మ్యూజిక్ అందించిన థమన్ సహా ప్రతి ఒక్క టెక్నీషన్‌కి థ్యాంక్స్. మిగతా సాంగ్స్ కుడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి” అన్నారు. డిసెంబర్ 20న ‘‘ప్రతిరోజూ పండగే’ విడుదల కానుంది.