Lenin: ప్లానింగ్ లేదా ఏంటి.. లెనిన్ సినిమాలో రీ షూట్స్ చేస్తున్నారట.. పాపం అఖిల్ ఈ సినిమా కూడానా..

అఖిల్ రీసెంట్ గా 'లెనిన్(Lenin)' సినిమాను స్టార్ట్ చేశాడు. రూరల్ బ్యాక్డ్రాప్ లో రా అండ్ రస్టిక్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు మురళి కిషోర్ అబ్బుర తెరకెక్కిస్తున్నాడు.

Lenin: ప్లానింగ్ లేదా ఏంటి.. లెనిన్ సినిమాలో రీ షూట్స్ చేస్తున్నారట.. పాపం అఖిల్ ఈ సినిమా కూడానా..

director murali kishor abburu re shooting some scenes in akhil lenin movie

Updated On : December 1, 2025 / 5:04 PM IST

Lenin: అఖిల్ అక్కినేని.. ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టడం కోసం చాలా కష్టపడుతున్నాడు. అఖిల్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేకపోవడం గమనార్హం. మధ్యలో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా యావరేజ్ గా నిలిచింది. ఆ తరువాత కూడా పలు సినిమాలు చేశాడు కానీ, హిట్ మాత్రం వరించలేదు అనే చెప్పాలి. ఇక స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ సినిమా కూడా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. ఇక అప్పటినుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న అఖిల్ రీసెంట్ గా ‘లెనిన్(Lenin)’ సినిమాను స్టార్ట్ చేశాడు.

Chiranjeevi-Venkatesh: చిరంజీవి-వెంకటేష్ కాంబోలో సాంగ్.. డాన్స్ కుమ్మేసిన స్టార్స్.. లీక్ చేసిన అనిల్ రావిపూడి

రూరల్ బ్యాక్డ్రాప్ లో రా అండ్ రస్టిక్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన అనౌన్స్ మెంట్ వీడియోకి అక్కినేని ఫ్యాన్స్ నుంచి నార్మల్ ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ చూసిన ప్రేక్షకులు కూడా అఖిల్ కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అని ఫిక్స్ అయ్యారు. కానీ, ఈ సినిమా షూటింగ్ కూడా చాలా మార్పులు చేర్పులతో జరుగుతుందట. ఇప్పటికే ఈ సినిమా నుంచి హీరోయిన్ ని మార్చేశారు. ముందు ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను అనుకున్నారు. కానీ, ఈ అమ్మడుకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుండటంతో ఆమె ప్లేస్ ను భాగ్య శ్రీ బోర్సే తో రీప్లేస్ చేశారు.

సినిమా అన్నాక అవి సహజమే అనుకునే టైంలో లెనిన్ సినిమా గురించి మరో షాకింగ్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే, లెనిన్ సినిమా కథ విషయంలో కొన్ని మార్పులు చేస్తున్నారట మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వెల్ ఎపిసోడ్ ను భారీగా తెరకెక్కించాడు దర్శకుడు. కానీ, కథలో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల ఆ ఇంటర్వెల్ సీన్ ను మళ్ళీ రీ షూట్ చేయనున్నారట. ఇవన్నీ చూస్తుంటే లెనిన్ సినిమాపై కూడా నెగిటీవ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేలా కనిపిస్తుంది ఏది ఏమైనా కనీసం ఈ సినిమాతో అయినా అఖిల్ హిట్ కొట్టాలని కంకణం కట్టుకొని కూర్చున్నాడు చూడాలి మరి ఈ సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందా అని.