Kalki 2898 AD : సోషల్ మీడియాలో వస్తున్న రూమర్ల పై స్పందించిన నాగ్ అశ్విన్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'కల్కి 2898AD'.

Kalki 2898 AD
Kalki 2898 AD – Dune : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లోక నాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకోన్, దిశాపటాని లతో పాటు టాలీవుడ్ స్టార్ నటుడు రానాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్విని దత్ దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా 2024 జూన్ 27 విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర బృందం తెలియజేసింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. ఈ పోస్టర్‌లో అమితాబ్, ప్రభాస్, దీపికా పదుకోన్ నిలబడి ఉండగా.. ఎడారి లాంటి ప్రాంతంలో కొందరు పడి ఉండడం కనిపిస్తోంది. ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.
All the forces come together for a better tomorrow on ??-??-????.#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #Kalki2898ADonJune27 pic.twitter.com/kItIJXvbto
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 27, 2024
కాగా.. ఈ పోస్టర్‌ను చూస్తుంటే.. కల్కీ 2898 ADకి ఓ హాలీవుడ్ సినిమాకి పోలికలు కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ నివేదిక ప్రకారం.. దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా ఈ పోలికలను కొట్టిపారేశాడు. కేవలం ఇసుక ఉండటం వల్ల సినిమాలు ఒకే విధంగా ఉన్నాయని ప్రేక్షకులు విశ్వసించకూడదని చెప్పాడు.
కాగా.. కల్కీ సినిమాను హాలీవుడ్ సినిమాతో పోల్చడం ఇదే తొలిసారి కాదు. కాన్సెప్ట్, మేకింగ్, క్రాప్ట్ , విజువలైజేషన్ ఇలా ప్రతీదాన్ని హాలీవుడ్ సినిమాలతో పోలుస్తున్నారు.