Nag Ashwin : ప్రభాస్ ‘కల్కి’ సినిమాపై డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ చెప్పిన ఆసక్తికర విషయాలు ఇవే..
తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ బాంబే ఐఐటిలో జరుగుతున్న కాలేజీ ఫెస్ట్ లో పాల్గొన్నారు. అక్కడ స్టూడెంట్స్ తో అయన ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ కల్కి సినిమా గురించి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

Director Nag Ashwin says Interesting Facts about Prabhas Kalki 2898AD Movie
Nag Ashwin : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా ‘కల్కి 2898AD’(Kalki) సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉందని సమాచారం. ఇప్పటికే ‘కల్కి 2898AD’ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. హిందూ మైథలాజి కథతో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ బాంబే ఐఐటిలో జరుగుతున్న కాలేజీ ఫెస్ట్ లో పాల్గొన్నారు. అక్కడ స్టూడెంట్స్ తో అయన ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ కల్కి సినిమా గురించి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలు, నాగ్ అశ్విన్ ఇచ్చిన సమాధానాలు ఇవే..
మిగతా సైన్స్ ఫిక్షన్ సినిమాలకు, కల్కి ఎంత భిన్నంగా ఉంటుంది?
మన దగ్గర సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఎక్కువ రాలేదనే చెప్పాలి. కొన్ని టైం ట్రావెల్ సినిమాలు వచ్చాయి. కల్కి చాలా డిఫరెంట్ సినిమా. ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే కథ ఇది. హాలీవుడ్ సినిమాల్లో అక్కడి సిటీలు భవిష్యత్ లో ఎలా ఉంటాయో చూశాం. ‘కల్కి’లో ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉంటాయో చూస్తారు. ‘కల్కి’ కోసం దాదాపు ఐదేళ్ళుగా కష్టపడుతున్నాం. ప్రతి అంశంపై లోతుగా అలోచించి, స్క్రాచ్ నుంచి అన్ని కొత్తగా డిజైన్ చేసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాం. ప్రేక్షకులకు అది తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను.
టీజర్ లో కొత్త ఆయుధాలు కనిపించాయి.. వాటి గురించి చెప్పండి?
కల్కి కోసం చాలా డిజైన్ వర్క్ చేశాం. కాన్సెప్ట్ ఆర్టిస్ట్ లు, ప్రొడక్షన్స్ డిజైనర్స్ ఇలా టీం అంతా కలసి చాలా వర్క్ చేసాం. ఇందులో వాడే టెక్నాలజీ, ఆయుధాలు, ట్రోప్స్, కాస్ట్యూమ్స్ ప్రతిది భారతీయ మూలంతో ముడిపడి అది భవిష్యత్ లో ఎలా మార్పు చెందే అవకాశం ఉండనే అంశం పైన ప్రత్యేక శ్రద్ద తీసుకొని డిజైన్ చేశాం. తెరపై అది అద్భుతంగా కనిపిస్తుందనే నమ్మకం నాకు ఉంది.
ప్రభాస్ గారితో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె.. ఇలా వారి పాత్రల గురించి చెబుతారా?
వారై పాత్రలు ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్పకూడదు. అయితే అందరి స్టార్స్ అభిమానులు ఆనందపడే విధంగానే ఉంటాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పాత్రల్లో వాళ్ళు కనిపించలేదు. తప్పకుండా ఫ్యాన్స్ ని ఈ సినిమాతో అలరిస్తారు.
కల్కికి… ‘2898 AD’ అనే టైమ్ లైన్ పెట్టడానికి కారణం ఏంటి?
దీనికి వెనుక ఒక లాజిక్ వుంది. అయితే అది సినిమా విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో చెప్తాను.
ఈ చిత్రం మ్యూజిక్ కోసం సంతోష్ నారాయణ్ ని తీసుకోవడానికి కారణం?
ఇండియన్ రూట్ తో వరల్డ్ ఫీలింగ్ కలిగించే మ్యూజిక్ ఇచ్చే కొద్దిమంది కంపోజర్స్ లో సంతోష్ నారాయణ్ ఒకరు. అందుకే ఆయన్ని తీసుకున్నాము.
కల్కి కోసం ప్రభాస్ గారు ఎలా మేకోవర్ అయ్యారు ? ఇందులో ప్రభాస్ ని కొత్తగా చూడొచ్చా ?
కల్కిలో ఫ్యూచర్ ప్రభాస్ ని చూస్తారు.
కల్కి అంటే విష్ణు అవతారం అంటారు కదా.. మీరు కూడా నాగీ యూనివర్స్ ని ప్లాన్ చేస్తున్నారా ?
లేదు.
ప్రభాస్, కమల్ హసన్, అమితాబ్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
అందరూ అద్భుతమైన వ్యక్తులు. గ్రేట్ యాక్టర్స్. చాలా హంబుల్ గా ఉంటారు. వారికి సినిమా అంటే ప్రేమ, ఇష్టం. వీరిలో వుండే సిమిలర్ క్వాలిటీ ఇదే.
కల్కి రిలీజ్ డేట్ ఎప్పుడు ?
త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాం.
కల్కి ట్రైలర్ ఎప్పుడు విడుదల కావచ్చు ?
93 రోజుల తర్వాత ఉండొచ్చు.