RAM first look : ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ చేతుల మీదుగా రామ్‌ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

దీపిక ఎంటర్‌టైన్‌మెంట్, ఓఎస్‌ఎం విజన్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రామ్‌ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్). దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.

RAM first look : ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ చేతుల మీదుగా రామ్‌ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

RAM first look

Updated On : September 19, 2023 / 3:04 PM IST

RAM first look : దీపిక ఎంటర్‌టైన్‌మెంట్, ఓఎస్‌ఎం విజన్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రామ్‌ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్). దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. స్టార్ ద‌ర్శ‌కుడు పరశురామ్ చేతుల మీదుగా విడుదల చేసిన ఈ గ్లింప్స్‌లో దేశాన్ని, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ హీరో చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. మొత్తంగా గ్లింప్స్ ఆక‌ట్టుకుంది. ఇక రామ్ (RAM- రాపిడ్‌ యాక్షన్‌ మిషన్‌) టైటిల్ మధ్యలో కనిపిస్తున్న అశోక చక్రం ఈ మూవీ రేంజ్ ఏంటో చెబుతోంది.

Director Parasuram Launched First Look Of RAM

Director Parasuram Launched First Look Of RAM

దీపికాంజలి వడ్లమాని ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం కానున్నారు. ధ‌న్య బాల‌కృష్ణ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రంతో మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ లు అందించ‌డం విశేషం. ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతాన్ని అందిస్తుండ‌గా భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ధారణ్ సుక్రి డిఎసి సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు.

Bandla Ganesh : బాలకృష్ణ హాస్పిటల్ ముందు.. బండ్లన్న అన్నదానం..