Average Student Nani : మొన్న బోల్డ్ పోస్టర్.. ఇవాళ క్యూట్ లవ్ మోషన్ పోస్టర్.. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’
మెరిసే మెరిసే సినిమాతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా మెప్పించాడు. ఇప్పుడు ఈ దర్శకుడు హీరోగా కూడా మారుతున్నాడు.

Director Pavan Kumar Turned as Hero with Average Student Nani Movie Motion Poster Released
Average Student Nani : దర్శకులు హీరోలుగా, హీరోలు దర్శకులుగా మారడం గతంలో కూడా జరిగిన సంగతి తెలిసిందే. మెరిసే మెరిసే సినిమాతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా మెప్పించాడు. ఇప్పుడు ఈ దర్శకుడు హీరోగా కూడా మారుతున్నాడు. ఇటీవల పవన్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ సినిమా నుంచి ఓ బోల్డ్ పోస్టర్ రిలీజ్ చేసి వైరల్ అయ్యాడు.
పవన్ కుమార్ ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే దర్శకుడిగా, నిర్మాతగా కూడా తనే చేస్తున్నాడు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. గతంలో ఫస్ట్ లుక్ పోస్టర్ అంటూ ఓ బోల్డ్ లుక్ రిలీజ్ చేసి వైరల్ అవ్వగా తాజాగా ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
Also Read : MR. & MRS. MAHI : ‘మిస్టర్ & మిసెస్ మహీ’ మూవీ రివ్యూ.. క్రికెటర్‌గా జాన్వీ కపూర్..
శక్తి శ్రీ గోపాలన్ పాడిన మంచి పాట బ్యాక్ గ్రౌండ్‌లో వినిపిస్తుంటే.. హీరో హీరోయిన్ల జోడి పోస్టర్ లో కనిపించింది. ఈ సినిమాలో సాహిబా భాసిన్, స్నేహ మాల్వియ, వివియా సంత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఝాన్సీ, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.