Karuppu: ‘కరుప్పు’ విజయ్‌తో చేయాల్సిన సినిమా.. సూర్యపై ఆర్జే బాలాజీ షాకింగ్ కామెంట్స్
సూర్య కరుప్పు(Karuppu) సినిమాపై దర్శకుడు ఆర్జే బాలాజీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
Director RJ Balaji shocking comments on Suriya Karuppu movie
- కరుప్పు సినిమాపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
- విజయ్ చేయాల్సిన సినిమాతో సూర్యతో చేశానని కామెంట్స్
- వైరల్ అవుతున్న దర్శకుడి కామెంట్స్
Karuppu; కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీ కాంబోలో వస్తున్న మూవీ ‘కరుప్పు’. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సూర్య ఫ్యాన్స్ అయితే ఈ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలంగా సూర్యకు సరైన హిట్ లేదు. అందుకే, కరుప్పు సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఇప్పటికే.. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే, కరుప్పు సినిమా విడుదల అవుతున్న సందర్బంగా దర్శకుడు ఆర్జీ బాలాజీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘కరుప్పు(Karuppu) సినిమా కథను సూర్య కోసం కాకుండా తలపతి విజయ్ కోసం రాసుకున్నాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ విషయం గురించి మాట్లాడారు.
Niharika Konidela: ఆ వార్తలు నమ్మకండి.. ఏదైనా ఉంటే చెప్తాను.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చేసిన నిహారిక
‘2023లో ‘కరుప్పు’ కథా రచన ప్రారంభించినప్పుడు, స్క్రిప్ట్ స్పాన్ పెరుగుతూ వచ్చింది. అప్పుడే అనుకున్నాను ఈ కథకు భారీ స్టార్ హీరో అయితేనే న్యాయం జరుగుతుందని. అప్పుడే విజయ్ను కలిసి పూర్తి స్క్రిప్ట్‌ను వినిపించగా, ఆయనకు కథ బాగా నచ్చింది. షూటింగ్ వెంటనే మొదలుపెట్టగలవా? అని విజయ్ అడిగారు. ఆ సమయంలో సరైన ప్రిపరేషన్ కోసం కొంత సమయం కావాలని అడిగాను. అప్పుడే, విజయ్ రాజకీయ ప్రయాణం (TVK పార్టీ) పనుల్లో బిజీ అయిపోవడంతో మా కాంబినేషన్ కుదరలేదు.
ఆ తరువాత, అదే కథన సూర్యకు వినిపించాగా సూర్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఆయన ఇమేజ్‌కు మరియు బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా హీరో పాత్రలో కొన్ని కీలక మార్పులు చేశాం అంటూ’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో, ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో యోగి బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి చాలా ఆసక్తికర అంశాలతో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ రాబడుతుంది అనేది చూడాలి.
