Sandeep Raj: నేను సింపతీ కోసం చేయలేదు.. మళ్ళీ వాయిదా అనేసరికి బాధేసింది.. అఖండ 2పై కోపం లేదు..
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్(Sandeep Raj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కలర్ ఫోటో లాంటి సినిమా చేసి ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నాడు ఈ దర్శకుడు. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా మోగ్లీ.
Director Sandeep Raj announces new release date for Mowgli
Sandeep Raj: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కలర్ ఫోటో లాంటి సినిమా చేసి ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నాడు ఈ దర్శకుడు. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా మోగ్లీ. రోషన్ కనకాల హీరోగా వస్తున్న ఈ సినిమాలో సాక్షి మధోల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. బండి సరోజ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టీజర్, ట్రయిలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమాను ముందుగా డిసెంబర్ 12న విడుదల చేయాలనీ ప్లాన్ చేశారు మేకర్స్.
కానీ, అనూహ్యంగా అదే రోజున బాలకృష్ణ హీరోగా వస్తున్న భారీ సినిమా అఖండ 2 రిలీజ్ కానుంది. దీంతో మోగ్లీ సినిమాను వాయిదా వేయాలని అనుకున్నారు మేకర్స్. దీంతో, డిజప్పాయింట్ అయినా దర్శకుడు సందీప్ రాజ్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. తాను దురదృష్టవంతుడిని అంటూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు. దీంతో, బాలకృష్ణ ఫ్యాన్స్ సందీప్ రాజ్ ను టార్గెట్ చేశారు. కావాలనే సింపతీ కోసం ఇలాంటి పోస్ట్ పెట్టాడు అంటూ ట్రోల్స్ చేశారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో స్పందించాడు సందీప్ రాజ్(Sandeep Raj). తాను ఆ పోస్ట్ సింపతీ కోసం చేయలేదని చెప్పుకొచ్చాడు.
‘ఈ సమయంలో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సింపతీ కోసం నేను ఆ పోస్ట్ చేయలేదు. మోగ్లీ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయాలనుకున్నాం. కానీ, అనుకోని కారణాల వల్ల వచ్చే ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌కు వాయిదా వేయాలని భావించాం. ఆ మాట వినగానే భావోద్వేగానికి లోనయ్యాను. ఆ ఎమోషన్‌లోనే ఆ పోస్ట్ పెట్టాను. అంతేకాని, అఖండ 2పై అపారమైన గౌరవం ఉంది. విమర్శలు ఎదుర్కోవాలని నేను అనుకోవడం లేదు. కొంతమంది నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. దయచేసి ఒకసారి నా వైపు నుంచి కూడా ఆలోచించండి. ఇక మోగ్లీ సినిమా డిసెంబర్ 13నే విడుదల చేయాలని నిర్ణయించాం. మీ సపోర్ట్ కావాలి” అంటూ రాసుకొచ్చాడు. దీంతో సందీప్ చేసిన ఈ పోస్ట్ కూడా వైరల్ అవుతోంది.
