Psych Siddhartha Postponed: అఖండ 2 ఎఫెక్ట్.. వాయిదా పడిన ‘సైక్ సిద్దార్థ’.. జై బాలయ్య అంటూ వీడియో రిలీజ్..

సైక్ సిద్దార్థ సినిమా విడుదలను వాయిదా వేస్తూ(Psych Siddhartha Postponed) మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఈమేరకు హీరో నందు, నిర్మాత రానా ఒక వీడియో విడుదల చేశారు.

Psych Siddhartha Postponed: అఖండ 2 ఎఫెక్ట్.. వాయిదా పడిన ‘సైక్ సిద్దార్థ’.. జై బాలయ్య అంటూ వీడియో రిలీజ్..

Psych Siddhartha movie postponed due to Akhanda 2

Updated On : December 10, 2025 / 2:12 PM IST

Psych Siddhartha Postponed: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమాను ముందుగా డిసెంబర్ 5న విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీకి వాయిదా పడింది. అయితే, డిసెంబర్ 12న దాదాపు ఒక 10 చిన్న సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. ఆ టైంలో అఖండ 2 రావడంతో మిగతా సినిమాల మేకర్స్ వాయిదాల బాట పడుతున్నారు.

Karthi: తమిళ ఇండస్ట్రీ ప్రత్యేకత ఏంటి.. మనకు ఎందుకు భయం.. తెలుగులోలా మనం చేయలేమా..

ఈ లిస్టులో ముందుగా వాయిదా పడుతున్న సినిమా సైక్ సిద్దార్థ(Psych Siddhartha Postponed). నటుడు నందు హీరోగా వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు వరుణ్ రెడ్డి తెరకెక్కిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. టీజర్, ట్రైలర్ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయడంతో సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, అఖండ రాకతో ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఈమేరకు హీరో నందు, నిర్మాత రానా ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఇద్దరు జై బాలయ్య అంటూ స్లోగన్ ఇచ్చారు. ఫైనల్ ఈ సినిమాను 2026 జనవరి 1న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరి బాలయ్య కోసం విడుదల వాయిదా వేసుకున్న ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి.