సినిమా వాళ్లకి అంకితం.. ‘సినిమాలే లైఫ్ రా మామా’

Cinema Le Life Raa Mama: సినిమా ఇండస్ట్రీ.. రంగుల ప్రపంచం.. తాము ఏ పరిస్థితిలో ఉన్నా, తమలో ఎలాంటి విషాదం దాగి ఉన్నా ప్రేక్షకుణ్ణి ఎంటర్‌టైన్ చెయ్యడం కోసమే తాపత్రయ పడతాడు సినిమా వాడు.. తెరమీద వినోదం చూపించే వారి జీవితాల్లో తెరవెనుక కనబడని కష్టం దాగి ఉంటుంది.
సినిమానే ప్రాణంగా ఫీలయ్యే వారికి సినిమానే జీవితం. ఇప్పుడు ఇదే పేరుతో ‘సినిమాలే లైఫ్ రా మామా’ అనే సినిమా తెరకెక్కుతోంది. ‘మంచి కాఫీలాంటి పెళ్లిచూపులు’ షార్ట్ ఫిలిం చేసిన టీమ్ ఈ మూవీకి కలిసి పనిచేశారు.
చైతన్య రాపేటి దర్శకత్వంలో, అరవింద్, విక్రమ్ నిర్మించారు. ఔత్సాహిక సినీ దర్శకులందరికీ ఈ సినిమాను అంకితమిస్తున్నారు. దీన్ని బట్టి మూవీ టీమ్‌కు సినిమా అంటే ఎంత ప్యాషనో అర్థమవుతోంది.
రవి శివ తేజ, తాన్య చౌదరి హీరో హీరోయిన్లు. ‘ఘాజి’, ‘అంతరిక్షం వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ‘సినిమాలే లైఫ్ రా మామా’ పోస్టర్ రిలీజ్ చేశారు.
సినిమా వాళ్ల జీవితంలో నిత్యం వినిపించే.. ‘యాక్షన్, షాట్ ఓకే, కట్ ప్యాకప్’ వంటి పదాలతో డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. సంగీతం : పి.ఆర్. (పెద్దపల్లి రోహిత్), కెమెరా : దాసరి కిరణ్, ఎడిటింగ్ : గణేష్ కొమ్మారపు.