Satish Vegesna: వేగేశ్న సతీష్ ‘కథలు(మీవి మావి)’ వెబ్ సిరీస్!

శతమానం భవతి లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా తీసిన దర్శకుడు సతీష్ వేగేశ్న ఇప్పుడు డిజిటల్ రంగ ప్రవేశం కూడా చేస్తున్నాడు. శతమానం భవతి తర్వాత శ్రీనివాస కళ్యాణం..

Satish Vegesna: వేగేశ్న సతీష్ ‘కథలు(మీవి మావి)’ వెబ్ సిరీస్!

Satish Vegesna

Updated On : March 20, 2022 / 1:20 PM IST

Satish Vegesna: శతమానం భవతి లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా తీసిన దర్శకుడు సతీష్ వేగేశ్న ఇప్పుడు డిజిటల్ రంగ ప్రవేశం కూడా చేస్తున్నాడు. శతమానం భవతి తర్వాత శ్రీనివాస కళ్యాణం, ఎంత మంచివాడవురా లాంటి కుటుంబ కథలతో వచ్చిన సతీష్ ఇప్పుడు రియల్ స్టార్ శ్రీహరి కొడుకు మేఘాంశ్ శ్రీహరి.. తన వారసుడు సమీర్ వేగేశ్నలతో కలిసి కోతి కొమ్మచ్చి అనే కామెడీ ఎంటర్ టైనర్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ చంద్ర హీరోగా పరిచయం చేస్తూ శ్రీ శ్రీ శ్రీ రాజావారు అనే సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.

Web Series Telugu: ఓటీటీని దోచుకొనే పనిలో పడిన టాప్ డైరెక్టర్లు.. బడా ప్రొడ్యూసర్లు!

ప్రస్తుతం టాలీవుడ్లో వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే కొందరు సీనియర్ దర్శకులు కూడా వెబ్ సిరీస్ లు చేస్తూ ఓటీటీ ఆడియన్స్ ని మెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు అనే బ్రాండ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ సతీష్ వేగేశ్న కూడా ఒకవైపు సిల్వర్ స్క్రీన్ సినిమాలను తెరకెక్కిస్తూనే మరోవైపు ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సతీష్ వేగేశ్న ప్రస్తుతం పల్లెటూరి కథలతో ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా ఆయన మార్క్ పల్లెటూరి కథలతో తెరకెక్కనున్న ఆంతాలజీతో కూడిన వెబ్ సిరీస్.

Web Series : ఓటీటీలోనూ సత్తా చాటుతాం..

అందుకే దీనికి ‘కథలు(మీవి మావి)’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే మూడు కథలకు సంబంధించి షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మిగిలిన కథలు షూట్ చేసి ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ద్వారా విడుదల చేయనున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన సినిమాలు తీసి దర్శకుడిగా మెప్పించిన సతీష్ వేగేశ్న ఈ వెబ్ సిరీస్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ హాయిగా చూసేలా ఎటువంటి వల్గారిటీ లేకుండా క్లీన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ కోసం కొందరు ప్రముఖ నటీ నటులు అలాగే సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. త్వరలోనే మిగతా వివరాలు వెల్లడించనున్నారు.